devara: దేవర పై హీరోయిన్ రియాక్షన్...ఇంత హింస అవసరమా!

ఈ సినిమా మొదటి రోజునే 8,000 షోలు వేశారు. ఇందులో 4,200 తెలుగు వెర్షన్ షోలు. ఆ తరువాత హిందీ దేవర 3,200 షోస్ వేశారు. ఇంత వరకు అభిమానుల సరదాను ఎవ్వరు కాదనలేం .


Published Sep 30, 2024 11:10:00 AM
postImages/2024-09-30/1727674903_256614ved2.gif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన స్టార్ల లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. కల్కి కలక్షన్లకే కళ్లు తిరిగాయన్నారు..ఇప్పుడు దేవర జస్ట్ మూడు నాలుగు రోజులకే 140 కోట్ల కలక్షన్స్. కల్కి 2898ఏడీ సినిమా తరువాత దేవర వరల్డ్ వైడ్ కలెక్షన్లలో రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా మొదటి రోజునే 8,000 షోలు వేశారు. ఇందులో 4,200 తెలుగు వెర్షన్ షోలు. ఆ తరువాత హిందీ దేవర 3,200 షోస్ వేశారు. ఇంత వరకు అభిమానుల సరదాను ఎవ్వరు కాదనలేం .


కాని దేవర రిలీజ్ రోజు అభిమానులు చేసిన రచ్చ మామూలుగా లేదు. థియేటర్‌ అద్దాలు, పగులగొట్టడం, ప్రమాదవశాత్తు సుదర్శన్‌ థియేటర్‌లో దేవర ఫ్లెక్లీ కాలిపోవడం లాంటి చాలా జరిగాయి . దీంతో ఫ్యాన్స్ మరో చెత్త పని చేశారు. ఇఫ్పుడు ఆ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఆ వైరల్ అయిన వీడియోపై హిరోయిన్‌  వేదిక స్పందించింది. ఏంటీ ఘోరం ఇకనైనా ఆపండి అంటూ పోస్టు కూడా పెట్టింది. 


ఓ థియేటర్ వద్ద దేవర ఫ్యాన్స్‌ మేకను బలిచ్చారు. ఆ వీడియో చూసి ఆమె స్పందించారు. ఏంటీ ఘోరం ఇకనైనా ఆపండి. చూస్తేనే భయంకరంగా ఉంది ఆ అమాయకపు మూగజీవి ఏం చేసింది?. నా హృదయం కలిచివేస్తుంది. అభిమానం పేరిట నోరు లేని మూగజీవిని బలివ్వడం ఏంటి? ఒకరు కాళ్లు పట్టుకుని లాగుతున్నారు, మరొకరు తలపట్టుకున్నారు. ఇంకొకరు తల నరికేశారు. ఆ తలతో పోస్టర్‌కు అభిషేకం చేశారు జంతు బలి ఎవరూ మెచ్చుకోరు. ఆ నోరులేని మూగజీవి ఆత్మకు శాంతి చేకూరలని కోరుతున్నాను. అభిమానానికి హద్దు ఉండాలి. ఇలా మరో ప్రాణం పోయేంత అభిమానం మంచిది కాదంటు రియాక్ట్ అయ్యింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movies devara fans

Related Articles