సూర్యతో సినిమా ఫ్లాప్ . విజయ్ సేతుపతి తో కాతువాక్కుల రెండు కాదల్ సినిమా సూపర్ హిట్.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: స్టార్ హీరోయిన్ నయన్ భర్త విఘ్నేష్ శివన్ తన ఎక్స్ అకౌంట్ ను సడన్ గా డిలీట్ చేసేశారు. అసలే ఈ మధ్య నయన్ , తన భర్త వార్తల్లో బోలేడు గొడవల్లో ఉన్నారు. అయితే విఘ్నేష్ శివన్ ఎంతో పాపులర్ అయినా తన మొదట సినిమా పోడా పోడి సినిమాతో డైరక్టర్ తో పరిచయమైన ఆయనకు నానమ్ రౌడీ దాన్ సినిమా తో బ్రేక్ వచ్చింది. తర్వాత సూర్యతో సినిమా ఫ్లాప్ . విజయ్ సేతుపతి తో కాతువాక్కుల రెండు కాదల్ సినిమా సూపర్ హిట్.
అజిత్ సినిమా అవకాశం చేజారిపోగా, శివకార్తికేయన్ తో చేయాల్సిన LIK సినిమాను ప్రదీప్ రంగనాథన్ తో పూర్తి చేశారు. ఈ సమ్మర్ లో రిలీజ్ కు రెడీ గా ఉంది. విఘ్నేష్ శివన్ తన ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లో చురుగ్గా ఉంటారు. అలాంటిది సడన్ గా తన ఎక్స్ అకౌంట్ ను డిలీట్ చేశారు. ఆయన ఎక్స్ లో 19 లక్షల , ఇన్స్టాగ్రామ్ లో 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రోజు తన ఎక్స్ ఖాతాను ఆయన సడెన్ గా తొలగించారు.
విగ్నేష్ శివన్ ఎక్స్ ఖాతాను తొలగించడానికి ఆయనపై వ్యతిరేకతే కారణమట. రీసెంట్ గా ధనుష్ తో గొడవలు జరుగుతున్నాయి.బరద్వాజ్ రంగన పాన్ ఇండియా డైరక్టర్ల చర్చలో విఘ్నేష్ చర్చలో పాల్గొనడం కూడా కారణం కావచ్చు. పాన్ ఇండియా డైరక్టర్ల చర్చలో విఘ్నేష్ శివన్ పాల్గొనడంపై నెటిజన్లు కామెంట్ చేశారట. దీంతో ఈగో హర్ట్ అయ్యి డిలీట్ చేసేశారని టాక్.