ఏం చేసినా కొహ్లీ ని కలవాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. అలా కొహ్లి ని కలవాలని ఓ కుర్రాడు ఏం చేశాడో తెలుసా .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కొహ్లీ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల్లో రన్ మెషిన్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొహ్లి బ్యాటింగ్ చిన్న పిల్లలయితే కొన్ని లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఏం చేసినా కొహ్లీ ని కలవాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. అలా కొహ్లి ని కలవాలని ఓ కుర్రాడు ఏం చేశాడో తెలుసా .
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన కార్తికేయకు కూడా విరాట్ అంటే పిచ్చి ఇష్టం. దాంతో తాజాగా కోహ్లీని చూడటానికి 15ఏళ్ల కార్తికేయ పెద్ద సాహసమే చేశాడు . తన ఫేవరేట్ క్రికెటర్ ను కలవడానికి 58 కిమీ సైకిల్ తొక్కుకొని కాన్సూర్ కు చేరుకున్నాడు.కాన్పూర్‌లోని గ్రీన్‌ఫీల్డ్ పార్క్‌లో శుక్రవారం ప్రారంభమైన భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు చూసేందుకు ఉన్నావ్ నుంచి ఇలా సైకిల్‌పై లాంగ్ జర్నీ చేసి మరీ వచ్చాడు.
తెల్లవారుజామున 4 గంటలకు తన స్వగ్రామం ఉన్నావ్ నుంచి గ్రీన్‌ఫీల్డ్ పార్క్‌కు బయల్దేరాడు. ఉదయం 11 గంటలకు స్టేడియానికి చేరుకున్నాడు. కాని కార్తీక్ ను నిరాశే మిగిలింది. ఫస్ట్ రోజు ఆట జరగకపోవడంతో కొహ్లీ బ్యాటింగ్ చూడాలనే కోరిక తీరలేదు. వర్షం వల్ల తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యమైంది. రెండో రోజు కూడా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో రెండు జట్ల ఆటగాళ్లు స్టేడియం నుంచి తిరిగి హోటల్‌కు వెళ్లిపోయారు. పాపం కార్తీక్ తన ఫేవరేట్ కొహ్లీ ని చూడడం కుదరనే లేదు.