Vishwambhara Climax: 68లో కూడా 20లా..మెగాస్టారా మజాకా.?

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో  అత్యంత సీనియర్ హీరోలలో ఈయన కూడా ఒకరు. ఇప్పటికి ఏడు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ సినిమాల్లో  యువ హీరోలకు పోటీనిస్తూ దూసుకుపోతున్నారు


Published Aug 05, 2024 08:01:07 PM
postImages/2024-08-05/1722868267_vishwambharamovie.jpg

న్యూస్ లైన్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో  అత్యంత సీనియర్ హీరోలలో ఈయన కూడా ఒకరు. ఇప్పటికి ఏడు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ సినిమాల్లో  యువ హీరోలకు పోటీనిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి చిరంజీవి 68 లో కూడా 28 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు. అలాంటి చిరు హీరోగా  తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర..

అలాంటి ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ హైదరాబాదులో చిత్రీకరణ జరుగుతుందట. దీంతో ఆదివారం  చిత్ర యూనిట్ హైదరాబాదులో  షూటింగ్ హైలెట్ చేసింది. అయితే విశ్వంభర చిత్రంలో  సినిమా మొత్తం ఒకెత్తయితే క్లైమాక్స్ మరో ఎత్తు ఉంటుందని తెలుస్తోంది.

దీనికోసం చిరంజీవి కూడా బాగా కష్టపడుతున్నారట.  అయితే క్లైమాక్స్ సీన్ కూడా హైదరాబాదులో చిత్రీకరణ చేసినట్టు తెలుస్తోంది.  భారీ సెట్స్ విజువల్  ఎఫెక్ట్స్ తో దర్శకుడు వశిష్ట  ఈ సీక్వెన్స్ ను దృశ్యకావ్యంలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

అయితే ఈ క్లైమాక్స్ సన్నివేశాలకు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు నేతృత్వం వహిస్తున్నారట. వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ అవ్వబోతున్న విశ్వంభర  చిత్రానికి క్లైమాక్స్ హైలెట్ కాబోతుందని తెలుస్తోంది. ఈ మూవీని వంశీ విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు.  త్రిష కథానాయకగా కనిపించబోతోంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu trisha vasista vishwambhara anal-arasu vishwambhara-climax

Related Articles