అసెంబ్లీలో బజారు భాష మాట్లాడిన ఎమ్మెల్యేలకు బాసటగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి తన తీరు ఏమిటో చెప్పకనే చెప్పారని ఆయన అన్నారు. ఇలాంటి దిగజారుడు సీఎంను తానెప్పుడూ చూడలేదని వివేకానంద్ అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి BRS నేత, ఖుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. రైతు రుణమాఫీ అయ్యేదాకా రేవంత్‌ను నిద్రపోనిచ్చేది లేదని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో బజారు భాష మాట్లాడిన ఎమ్మెల్యేలకు బాసటగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి తన తీరు ఏమిటో చెప్పకనే చెప్పారని ఆయన అన్నారు. ఇలాంటి దిగజారుడు సీఎంను తానెప్పుడూ చూడలేదని వివేకానంద్ అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో రైతు రుణమాఫీపై, రైతు భరోసాపై చర్చ పెడతామని చెప్పి.. కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై, ద్రవ్య వినిమయ బిల్లుపై, వ్యవసాయ డిమాండ్లపై మాట్లాడినప్పుడు BRS ఎమ్మెల్యేలు రైతు రుణమాఫీ, రైతుభరోసాలపై ప్రభుత్వాన్ని నిలదీశారని గుర్తుచేశారు. అయినప్పటికీ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుండి ఎలాంటి స్పందనా రాలేదని అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్యాస్, ట్రాష్ అన్నారని తెలిపారు.
ఎంపీ ఎన్నికల సమయంలో కూడా దేవుళ్లపై ఒట్లు పెట్టి రేవంత్ రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌరంపేట ప్రాథమిక సొసైటీలో 632 మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 14 మందికే మాఫీ అయిదని తెలిపారు. వాగ్దాన భంగాలు సీఎం రేవంత్ రెడ్డికి అలవాటే అని అన్నారు. అసెంబ్లీలో మాపై సీఎం రేవంత్ విషం చిమ్మారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఏం చేస్తున్నారో చెప్పలేదని అన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరేవరకు BRS పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. బడ్జెట్‌లో రైతులకిచ్చిన హామీలు నెరవేరేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదని తెలిపారు.