Yamadonga:మూవీలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర చేసిన వ్యక్తి ఇప్పుడేలా ఉన్నాడంటే.?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, కొంతమంది హీరో హీరోయిన్లకు సంబంధించినటువంటి చిన్నప్పటి ఫోటోలు  వైరల్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రింద వారు


Published Aug 06, 2024 08:48:41 PM
postImages/2024-08-06/1722957521_child.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, కొంతమంది హీరో హీరోయిన్లకు సంబంధించినటువంటి చిన్నప్పటి ఫోటోలు  వైరల్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రింద వారు నటించినప్పుడు  చాలా క్యూట్ గా ఉండే వారు. అలాంటివారిని ఇప్పుడు చూస్తే చాలామంది షాక్ అవుతున్నారు. అలా ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించినటువంటి ఒక బాబు మనందరికీ గుర్తుండే ఉంటారు. లడ్డుగా బొద్దుగా కనిపించే ఆ బాబు ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో అదరగొట్టేశాడు. ఇంతకీ ఆయన పేరు ఏంటయ్యా అంటే శ్రీ సింహ.  

అయితే ఈ సినిమా కంటే ముందు ఆయన విక్రమార్కుడు  హీరో హీరోయిన్ వెళ్లిన సమయంలో ఇంట్లో కనిపించే పిల్లల్లో ఒక అబ్బాయిగా చేశాడు. అలాంటి శ్రీ సింహ  ప్రస్తుతం చాలా పెద్దవాడు అయిపోయాడు. చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.  మర్యాద రామన్న మూవీలో కూడా రాయలసీమలో హీరో సునీల్ కి దారి చూపించే ఓబులేష్ క్యారెక్టర్ చేసి ఆ తర్వాత మత్తు వదలరా సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ మూవీ ప్రయోగాత్మక చిత్రంగా నిలిచింది. ఇందులో శ్రీ సింహ నటనకు గాను మంచి మార్కులు వచ్చాయి. అలాంటి ఈయన  ఇండస్ట్రీలో  హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు తహతలాడుతున్నాడు. ప్రస్తుతం ఆయన యమదొంగ సినిమాలో నటించినటువంటి చిన్నప్పటి పాత్ర సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజెన్స్  అప్పట్లో ఆయనను చూసి ఇప్పుడు కొత్తగా  చూసేసరికి షాక్ అయిపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : jr-ntr yamadonga srisimha

Related Articles