నేపాల్‌కు చెందిన జగత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 14 రోజుల క్రితం అతడికి అమ్మాయి పుట్టింది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ లో ఈ అమానవీయ సంఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన కన్న తండ్రే 14 రోజుల పసికందును అత్యంత కిరాతకంగా హతమార్చి మృత దేహాన్ని చెత్తకుప్పలో పడేశాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నేపాల్‌కు చెందిన జగత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 14 రోజుల క్రితం అతడికి అమ్మాయి పుట్టింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జగత్ తన కుమార్తెను దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. చంపిన తర్వాత చిన్నారి మృతదేహాన్ని టోలీ చౌకిలోని చెత్తకుప్ప సమీపంలో పడేసినట్లు గోల్కొండ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. జగత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అయితే ఎందుకు ఇంత కిరాతకంగా చేశాడనే విషయం నిందితుడు ఇంకా వెల్లడించలేదని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు పోస్టుమార్టటం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.