Birth Day : సీఐ బర్త్ డే వేడుకల్లో.. హెడ్ కానిస్టేబుల్ మృతి

కేక్ కట్ చేసిన అనంతరం భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కింద పడిపోయాడు.


Published Aug 05, 2024 03:58:12 PM
postImages/2024-08-05/1722853692_headconistable.jpg

న్యూస్ లైన్ డెస్క్ : హైదరాబాద్ కూకట్ పల్లిలో పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లి దేవి నగర్ లో నివాసముందే సీఐ శేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన దావత్ లో ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోయారు. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో సీఐగా పనిచేస్తున్న శేఖర్ తన పుట్టినరోజు సందర్భంగా దేవి నగర్ లోని తన నివాసంలో స్టాఫ్ కి బర్త్ డే పార్టీ ఇచ్చాడు.

స్నేహితులతో పాటు.. సిబ్బందిని కూడా ఆ పార్టీకి ఆహ్వానించాడు. సీఐ బర్త్ డే పార్టీకి మొత్తం 30 మందిరాగా.. అందులో 10మంది పోలీసులు ఉన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కింద పడిపోయాడు. మూడో అంతస్తు నుంచి డేవిడ్ కింద పడటంతో తలకు బలమైన గాయమైంది. దీంతో స్పాట్ లోనే చనిపోయాడు. డేవిడ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక బర్త్ డే పార్టీలో మద్యంలాంటివి సేవించడం వల్ల కింద పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

 

 

 

newsline-whatsapp-channel
Tags : telangana police crime- crime birthday latest-news news-updates telugu-news

Related Articles