ప్రస్తుత కాలంలో ఇండియా మొత్తంలో ప్రతిరోజు వందలాది అత్యాచారాలు జరుగుతున్నాయి. దేశంలో ప్రతి గంటకు ఏదో ఒక దగ్గర ఎవరో ఒకరో ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేస్తూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో ఇండియా మొత్తంలో ప్రతిరోజు వందలాది అత్యాచారాలు జరుగుతున్నాయి. దేశంలో ప్రతి గంటకు ఏదో ఒక దగ్గర ఎవరో ఒకరో ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేస్తూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చిన ఎన్ని శిక్షలు వేసినా ఈ అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. అలా ఒక అమ్మాయిపై పదహారేళ్ళకే 20 మంది కలిసి అఘాయిత్యం చేయడంతో వారిపై పగ పెంచుకున్న ఆ అమ్మాయి చివరికి 20 మందిని వెంటాడి కాల్చి చంపింది. ఇంతకీ ఆ ధైర్యవంతురాలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
తనపై అత్యాచారం చేసిన 20 మందిని ఒకేసారి కాల్చి చంపింది తానే బండిట్ క్వీన్ పూలన్ దేవి. ఉత్తరప్రదేశ్ లో నిరుపేద కుటుంబంలో పుట్టిన పూలన్ దేవి తన 11 ఏళ్ల వయసులోనే 30 ఏళ్ల వ్యక్తితో పెళ్లయింది. 18 ఏళ్ల వయసులో కొంతమంది ఆమెను బంధించి మరి అఘాయిత్యం చేశారు. ఫైనల్ గా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది. చివరికి బందిపోటుగా మారి, తనలాంటి బాధితులకు, పేదలకు అండగా నిలుస్తూ వచ్చింది. అమ్మాయిలకు మీటింగ్స్ పెట్టి బతకడానికి ధైర్యాన్ని కల్పించింది.
చివరికి తన ముఠాతో కలిసి తాను అఘాయిత్యం చేసిన 20 మంది ఇండ్లలోకి వెళ్లి వారిని దారుణంగా కాల్చి చంపింది. ఆ తర్వాత తనంతట తానే పోలీసులకు లొంగిపోయింది. దాదాపు 11 సంవత్సరాలు జైల్లో గడిపిన పూలన్ దేవి, 1994 లో జైలు నుంచి రిలీజ్ అయి 1996లో ఉత్తర ప్రదేశ్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది. చివరికి 2001 ఢిల్లీలో కొంతమంది ముసుగులో వచ్చిన వ్యక్తులు ఆమెను దారుణంగా కాల్చి చంపారు. ఈ విధంగా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో తానే ఒక ప్రభుత్వంగా మారి నిందితులను శిక్షించిందని ఆమెకు ఎంతోమంది ప్రజలు అండగా నిలిచి చివరికి ఎంపిక కూడా గెలిపించారు.