Rachakonda: వనస్థలిపురంలో కారు బీభత్సం.. ఘోర ప్రమాదం


Published Sep 01, 2024 07:05:54 PM
postImages/2024-09-01/1725197754_IMG20240901180658640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్ : హైదరాబాద్ లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

హయత్ నగర్ కి చెందిన రాష్ డ్రైవింగ్ తో పాదచారుల పైకి నడిపిన సోని ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్ కి తరలించగా వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన సోని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవింగ్ చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సీసీ టీవీలో రికార్డు అయిన ప్రమాదం దృశ్యాలు భీతి కలిగించేలా ఉన్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana fire-accident hyderabadtrafficpolice latest-news news-updates car

Related Articles