Bangladesh : బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు.. బార్డర్ వద్ద అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ

బంగ్లాదేశ్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు దగ్గర భారత సైన్యం అప్రమత్తమయింది. గత నెల నుంచి ఆ దేశంలో జరుగుతున్న అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.


Published Aug 05, 2024 07:45:10 PM
postImages/2024-08-05/1722867310_bsf.jpg

న్యూస్ లైన్ డెస్క్ : బంగ్లాదేశ్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు దగ్గర భారత సైన్యం అప్రమత్తమయింది. గత నెల నుంచి ఆ దేశంలో జరుగుతున్న అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరసనకారులు గాయాల పాలయ్యారు. ఏకంగా ఆ దేశ ప్రధాని దేశాన్ని విడిచి పారిపోయారు. బంగ్లాదేశ్ ప్రస్తుతం సైనిక పాలనలో ఉంది. ఆ దేశం పూర్తిగా అశాంతి, అల్లకల్లోలాలతో నిండి ఉంది. అల్లరి మూకలు ఏకంగా ప్రధాని నివాసంలో చొరబడి విధ్వంసం, లూటీకి పాల్పడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమయింది.

భారత్ -  బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. 4,096 కి.మీ మేర అదనపు బలగాలు బలగాలను మోహరించింది. కమాండర్లందరూ సరిహద్దులోనే ఉండాలని సీనియర్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బంగ్లాదేశ్ లో హింసాత్మక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైనట్టు సైనికాధికారులు తెలిపారు. ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు పెరగడంతో ఆ ప్రభావం భారత్ మీద పడకుండా, బంగ్లాదేశీయులు భారత్ లో ప్రవేశించకుండా ఉండేందుకు సరిహద్దు వద్ద బలగాలను అలర్ట్ చేశామన్నారు. తాజా పరిస్థితులను పరిశీలించేందుకు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ దల్ జీత్‌ సింగ్‌ చౌదరి భారత్ – బంగ్లా సరిహద్దు అయిన కలకత్తా చేరుకున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telanganam india latest-news news-updates telugu-news bangladesh

Related Articles