తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనుంది. ఇకపై ప్రతి యేటా ఈ దినోత్సవాన్ని జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఎగురవేయనున్నారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీ సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం జరపాలని పేర్కొంది. కాగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం హైదరాబాద్‌ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి జ్వాలలను నింపేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన విమోచనం దినత్వోవంగా జరుపుకోవాలని ప్రకటించింది.