దసరా నుంచి వీరి జీవితాల్లో అన్ని విజయాలే.?

దసరా వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో  దాదాపు పది రోజుల పాటు పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. దసరాకు సంబంధించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు


Published Oct 01, 2024 08:17:17 AM
postImages/2024-10-01/1727750837_dusserrra.jpg

న్యూస్ లైన్ డెస్క్: దసరా వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో  దాదాపు పది రోజుల పాటు పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. దసరాకు సంబంధించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మూడవ తేదీన ప్రారంభమై ఉత్సవాలు 12వ తేదీ వరకు కొనసాగుతాయి.  ఈ టైం లో చంద్రుడు, బుధుడు రాశులు  వారి స్థానాలను మార్చుకుంటున్నారు.  అంతేకాదు 11 నుంచి బృహస్పతి తిరోగమనలో ఉంటాడు కాబట్టి ఈ రాశులకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సమకూరుతాయట. దీనివల్ల కొన్ని రాశుల వారికి అన్ని శుభ ఫలితాలే ఉంటాయని అంటున్నారు. 

#1. తులారాశి:
 ఈ రాశి వారికి ఎలాంటి పనులు తలపెట్టిన విజయం కలుగుతుంది. వ్యాపారాలు, స్టాక్ మార్కెట్లు,  షేర్లు వంటివి ఎన్నో లాభాలను ఇస్తాయి. వివాహాల కోసం ట్రై చేస్తున్న వారికి  పెళ్లి సెట్ అవుతుంది. కొంతమందికి ఆకస్మిక ధన లాభం వస్తుంది.  అక్టోబర్ మొదటివారం నుంచి ఈ రాశి వారు  విజయాల దశలోకి అడుగు పెడతారు. 

 కుంభం:
 ఇక దసరా ప్రారంభం నుంచి ఈ రాశుల వారి జీవితం పచ్చ తోరణంలా మారిపోతుందట. వీరు ఏ వ్యాపార రంగంలో అడుగుపెట్టిన విజయం సాధిస్తారట. ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ తొలగిపోయి అన్ని రకాలుగా దూసుకెళ్తారని నిపుణులు అంటున్నారు. ఈ రాశుల వారు ఎక్కువ శుభవార్తలు వింటారు. 

 మిథునం:
 ఈ రాశుల వారికి  ఉద్యోగాల్లో ప్రముఖ హోదా లభిస్తుంది. ప్రముఖ వ్యాపారుల నుంచి మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి శుభకార్యాలు జరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో మంచి రేంజ్ లోకి వెళ్ళిపోతారు.

 కన్యరాశి:
 ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ పనిలో అయినా సక్సెస్ అవుతారు. వీరికి లక్ష్మీ కటాక్షం లభించి ఆర్థికంగా ఎదిగిపోతారు.సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line astrology libra dussera mithuna-rashi virgo

Related Articles