Girls: ఈ టైంలో పుట్టిన గర్ల్స్ లక్ష్మీ స్వరూపులే..పెళ్లి చేసుకుంటే శుభాలే?

మన భారతదేశ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దీని ప్రకారమే ఏ పండగ అయినా, ఏదైనా బిజినెస్ పనులు అయినా సరే ప్రారంభిస్తూ ఉంటారు. ఈ విధంగా హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్య


Published Oct 04, 2024 09:16:15 AM
postImages/2024-10-04/1728013575_lakshmidevi.jpg

న్యూస్ లైన్ డెస్క్: మన భారతదేశ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దీని ప్రకారమే ఏ పండగ అయినా, ఏదైనా బిజినెస్ పనులు అయినా సరే ప్రారంభిస్తూ ఉంటారు. ఈ విధంగా హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి శాస్త్రం ప్రకారం  మనిషి పుట్టిన సమయం, తేదీని బట్టి కూడా వారి జీవితం ఎలా ఉండబోతుందో కూడా చెప్పవచ్చు.  

ముఖ్యంగా అమ్మాయిలు కొన్ని డేట్స్ లో టైములో పుడితే లక్ష్మీదేవి స్వరూపం పుట్టినట్టే అని భావిస్తారు. అలాంటి అమ్మాయిలు  వారి చుట్టూ ఉన్నవారిని ఎప్పుడు సంతోషంగా ఉంచడమే కాకుండా వారు ఆర్థికంగా ఎదిగేలా చేస్తారట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. శాస్త్రం ప్రకారం  2, 11, 20 తేదీలలో  పుట్టినటువంటి గర్ల్స్  చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారని విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఆసక్తి చూపిస్తారని అంటున్నారు.

ముఖ్యంగా ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు వారికి వచ్చే జీవిత భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. వారిని ఎంతో సుఖపెట్టాలనే ప్రయత్నాలు చేస్తారట. ఎలాంటి పొరపాట్లు చేయకుండా నడుచుకుంటారట. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భార్యగా దొరకడం ఆ అబ్బాయిల యొక్క అదృష్టమే అని లక్ష్మీదేవి స్వరూపమే మీ ఇంటికి వచ్చినట్టే అని అంటున్నారు.  ఈ అమ్మాయిలు ఎలాంటి వారింటికి కొండలుగా వెళ్తారో ఆ ఇంట్లో ఆర్థికంగా డబ్బులకు ఇబ్బంది  ఉండదని  తెలియజేస్తున్నారు.

ఈ అమ్మాయిల వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందట. అంతేకాదు ఇలాంటి అమ్మాయిలు ఇతరులకు సహాయం చేయడంలో కూడా వెనకడుగు వేయరట. వీరి యొక్క క్యారెక్టర్ ను బట్టి చాలామంది ఇలాంటి అమ్మాయిలను ఇష్టపడతారట.  అంతేకాదు ఇలాంటి అమ్మాయిలు పుట్టిన ఇంట్లో కూడా ఆర్థికంగా తల్లిదండ్రులు బలపడడమే కాకుండా కుటుంబం సంతోషంగా జీవిస్తుందని అంటున్నారు  జ్యోతిష్య పండితులు.

newsline-whatsapp-channel
Tags : news-line astrology girls lakshmi god

Related Articles