బంగ్లా అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం చిచ్చురేపింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు చెలరేగాయి.
న్యూస్ లైన డెస్క్ : బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్లు, హింసలో ఇప్పటి వరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీంతో ప్రధాని వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని బంగ్లా సైన్యం హెచ్చరించడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి.. దేశం నుంచి పారిపోయారు. సైన్యం డెడ్ లైన్ విధించిన 45 నిమిషాల్లోపే ఆమె పదవికి రాజీనామా చేసి విమానం ద్వారా దేశం విడిచి వెళ్లిపోయారు.
బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన హసీనాకు భారతదేశంలో ఆశ్రయం లభించినట్టు సమాచారం. బంగ్లాలోని ఆమె ఇంటి వద్ద సైన్యం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశమంతా కర్ఫ్యూ విధించి శాంతి భద్రతల బాధ్యతల నుంచి పోలీసులను తప్పించి ఆర్మీ తీసుకుంది. ఆదివారం నాడు చెలరేగిన అల్లర్లలో ఆందోళనకారులు మంత్రుల ఇళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. అయితే.. బంగ్లా అమర వీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం ఈ అల్లర్లకు కారణమైంది.
ఆదివారం చెలరేగిన అల్లర్లలో ఆందోళనకారులు మంత్రుల ఇళ్లకు , ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లా అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం చిచ్చురేపింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు చెలరేగాయి. దేశంలో నెలకొన్న అశాంతి వాతావారణాన్ని అదుపు చేసేందుకు బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించారు.