BIGBOSS: మరో 24 గంటల్లో ముగియనున్న ఓటింగ్ ..ఫైనల్స్ కు వెళ్లేది ఎవరు !

మిగిలిన వారిలో మరో నలుగురు ఫైనల్ కి వెళ్తారు. సీజన్ 7లో ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు. 


Published Dec 05, 2024 04:46:00 PM
postImages/2024-12-05/1733397504_1836623biggboss8telugu.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : కేవలం కొన్ని గంటల్లో ఓటింగ్ లైన్స్ క్లోజ్  అయిపోతున్నాయి. నామినేషన్స్ లో 6 ఉన్నారు. 14వ వారం నామినేషన్స్ చాలా కీలకం. ఎలిమినేట్ అయితే అన్ని వారాల కష్టం వృధా అవుతుంది. టైటిల్ కొట్టినా కొట్టుకున్న ఫైనల్ కి వెళితే అదో ఆనందం. ఈ ఒక్క ఎలిమినేషన్ దాటేస్తే గోల్ రీచ్ అయినట్టే. 
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశలో ఉంది. ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ నేరుగా ఫైనలిస్ట్ అయిపోయాడు. మిగిలిన వారిలో మరో నలుగురు ఫైనల్ కి వెళ్తారు. సీజన్ 7లో ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు. 


సోమవారం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం అర్ధరాత్రి తో ముగియనుంది. ప్రతి టాస్క్ లో నిఖిల్ 100 పర్సెంట్ ఇస్తాడు. కాని గౌతమ్ కూడా టాప్ లో నే ఉన్నాడు. మూడో స్థానం లో ప్రేరణ ఉందత. ఈమె కూడా స్ట్రాంగ్ ప్లేయర్. కాకపోతే ప్రేరణ కొందరితో మాత్రమే క్లోజ్. ఫోర్త్ ప్లేస్ లో రోహిణి ఉందట. రోహిణి గత రెండు మూడు వారాలుగా తనలోని పవర్ చూపిస్తుంది. టాస్క్ లలో ఆడ పులిలా విజృంభిస్తుంది. 


రోహిణి గ్రాఫ్ పెరిగింది. విష్ణుప్రియ ఓటింగ్ లో ఐదో స్థానానికి పరిమితం కావడం అనూహ్య పరిణామం. భారీ ఫేమ్ ఉన్న విష్ణుప్రియ గేమ్ పరంగా వెనకబడింది. పృథ్వి వెనకాల తిరుగుతూ గేమ్ వదిలేసిన విష్ణుప్రియ టైటిల్ రేసు నుండి ఎలిమినేషన్ స్థాయికి పడిపోయింది. ఇక చివరి స్థానంలో నబీల్ ఉన్నాడట. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nikhil bigboss8 elimination

Related Articles