చైనాలోని ఓ వైద్యుడు 5,000 కి.మీ దూరంలో ఉన్న రోగికి శస్త్ర చికిత్స చేశారు. నిజానికి రోగి ఎక్కడో ఉన్నాడు జస్ట్ రిమోట్ కంట్రోల్ ద్వారా క్యాన్సర్ కణుతులు తొలగించడం చాలా ఆశ్చర్యంగా ఉందంటున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చైనా లోని షాంఘైలో ఓ సర్జన్ తన సర్జికల్ రోబోట్ ను ఉపయోగించి అధ్భుతం చేశాడు. 5వేల కిమీ దూరంలో ఉన్న రోగికి రిమోట్ ద్వారా ఉపిరితిత్తుల్లో క్యాన్సర్ కణుతులను తొలగించారు. ఆ ఆపరేషన్ సక్సస్ కావడంతో ఇఫ్పుడు సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది.
షాంఘై చెస్ట్ హాస్పిటల్‌లోని తన సహోద్యోగులతో కలిసి సర్జన్ దేశీయంగా తయారు చేసిన 5G సర్జికల్ రోబోట్‌ను ఉపయోగించి ఈ ఆపరేషన్ చేశారు. చైనాలోని ఓ వైద్యుడు 5,000 కి.మీ దూరంలో ఉన్న రోగికి శస్త్ర చికిత్స చేశారు. నిజానికి రోగి ఎక్కడో ఉన్నాడు జస్ట్ రిమోట్ కంట్రోల్ ద్వారా క్యాన్సర్ కణుతులు తొలగించడం చాలా ఆశ్చర్యంగా ఉందంటున్నారు. నిజానికి ఈ సర్జరీ జూలై 13న శస్త్రచికిత్స జరిగింది. అయితే ఈ ఆపరేషన్ వల్ల రోగులు బీజింగ్ మరియు షాంఘై వంటి పెద్ద నగరాలకు వెళ్లకుండా వారి స్వగ్రామంలో అత్యాధునిక వైద్య సేవలను అందించవచ్చు.
చైనాలో ఇటువంటి శస్త్రచికిత్సలను అతిపెద్ద పరిమాణంలో నిర్వహించే సౌకర్యం కూడా ఇదే. రోబోట్ సర్జరీ నిర్వహించడంతో పాటు, రోబోట్ టెక్నాలజీ పరిశోధన మరియు అభివృద్ధిలో కూడా ఆసుపత్రి పాలుపంచుకుంది. ఫ్యూఛర్ లో మరింత సేవలు పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు.