భారతదేశంలో పెళ్లి అనే బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మూడు ముళ్ళు, ఏడు అడుగులు అనే తంతుతో పెళ్లి అనే బంధం ముడిపడితే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు చచ్చే వరకు కలిసి
న్యూస్ లైన్ డెస్క్: భారతదేశంలో పెళ్లి అనే బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మూడు ముళ్ళు, ఏడు అడుగులు అనే తంతుతో పెళ్లి అనే బంధం ముడిపడితే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు చచ్చే వరకు కలిసి ఉండేవారు. అలా వారి అన్యోన్యమైనటువంటి దంపత్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని క్లియర్ చేసుకునేవారు. అసలు విడిపోవడం అనే మాట ఉండేది కాదు..
కానీ ప్రస్తుతం కాలం మారింది ఏడడుగులు వేసిన జంటలు కనీసం ఏడు నెలలు కూడా కలిసి ఉండటం లేదు. విడాకులు తీసుకొని ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు గడుపుతున్నారు. అలాంటి భార్యాభర్తల బంధంలో కనీసం ఏడు సంవత్సరాలు కూడా గడవకముందు వారి మధ్య ఫీలింగ్స్ అనేవి ఉండటం లేదట. దీంతో చాలామంది జంటలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి.. నిపుణులు ఏమంటున్నారు అనే వివరాలు చూద్దాం.
సమయం:
ప్రస్తుత కాలంలో చాలా మంది భార్యాభర్తలు సంపాదనపై పడి జాబ్స్ చేస్తూ వారి సొంత లైఫ్ ను కోల్పోతున్నారు. కనీసం ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి టైం కూడా పెట్టుకోవడం లేదు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ అనేది తగ్గుతూ దూరం అనేది పెరుగుతూ వస్తోంది. క్వాలిటీ టైం మిస్ అయి వారి జీవితంలోకి బిజీ టైం ఎంటర్ అవ్వడంతో చివరికి విడాకులు తీసుకొని విడిపోయే వరకు వస్తుందట.
చుట్టూ ఉన్న వాతావరణం:
మన తాతల తండ్రుల కాలంలో చాలామంది పెళ్లి చేసుకున్నారంటే చచ్చే వరకు జీవించేవారు. అంతేకాకుండా బంధాలు బంధుత్వాల మధ్య కాస్త గౌరవం ఉండేది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ బ్రతికేవారు. కానీ ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య పాజిటివ్ నెస్ అనేది తగ్గిపోయింది. చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మనలాగే ఉండడంతో అందరూ అలాగే తయారవుతున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య బంధం అనేది నిలబడడం లేదు.
రొమాన్స్:
భార్య భర్తల బంధంలో కోరికలు తీర్చుకోవడం అనేది ప్రధానమైనటువంటి ఘట్టం. అంటే కొంతమంది కేవలం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే భార్య ఉన్నట్టు గ్రహిస్తున్నారు. ఫిజికల్ గా కలవడం తప్ప మెంటల్ గా వారిని ప్రేమతో చూసుకోవడం లేదు. ఇక మరి కొంతమంది జంటలు పెళ్లయిన కొన్నాళ్లకే ఫిజికల్ రిలేషన్షిప్ పై ఆసక్తి చూపించకపోవడంతో చాలామంది ఫిజికల్ ఇంటరాక్షన్ మిస్ అయిపోయి పక్కదారులు పడుతున్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్య రొమాన్స్ అనేది తప్పనిసరిగా ఫిజికల్ గా, మెంటల్ గా క్లియర్ గా ఉండేలా చూసుకోవాలి.
ఊహాగానాలు :
భార్య భర్తల మధ్య ఏవైనా సమస్యలు వస్తే మీకు మీరే క్లియర్ చేసుకోవడం మంచిది. జరిగిన సమస్య చిన్నదైతే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి తప్పుగా ఊహించుకొని వారి జీవితాలను వారే సమస్యల్లో పడేసుకుంటున్నారు. మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారు, జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారో ఎప్పటికప్పుడు చర్చించుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు.