చర్చను ప్రారంభించిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. BRS సభ్యులపై పరుష పదజాలం వాడారు. ఏ ముస్కోవోయ్.. నీ అమ్మ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తోలు తీస్తా, బయట తిరగనియ్య కొడకా.. ఏమనుకుంటున్నారు రా.. అంటూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు.
న్యూస్ లైన్ డెస్క్: గత నెల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో BRS నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. BRS ఎమ్మెల్యేలను బయట తిరగనియ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండు అసెంబ్లీలో ఆయన BRS ఎమ్మెల్యేలపై బెదిరింపులకు పాల్పడ్డారు. దానం వ్యాఖ్యలపై సభలో BRS ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు.
చర్చను ప్రారంభించిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. BRS సభ్యులపై పరుష పదజాలం వాడారు. ఏ ముస్కోవోయ్.. నీ అమ్మ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తోలు తీస్తా, బయట తిరగనియ్య కొడకా.. ఏమనుకుంటున్నారు రా.. అంటూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. దీంతో ఆయన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని BRS సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో దానం దూషణలను స్పీకర్ తొలగించారు.
అయితే, నిండు సభలలో నోరు పారేసుకున్న దానం తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోని దానం.. తన నోటి దురుసుతనాన్ని ఎక్కడ పడితే అక్కడ చూపిస్తూనే ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణనాథుడి పూజకు వెళ్లిన దానం.. బూతులు మాట్లాడారు. వేల మంది జనం ఉన్నారు.. మీడియా అక్కడే ఉంది.. దేవుడి పూజా కార్యక్రమంలో ఉన్నామనే ఇంగితం లేకుండా ప్రవర్తించారు. అరే ఉండు బే.. అంటూ దానం బూతులు మాట్లాడారు.
గతంలో అసెంబ్లీ సమావేశాల్లో, ఇప్పడు వినాయకుడి పూజలో దానం బూతులు మాట్లాడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయన పక్కనే ఉన్నారు. అయితే, అసందర్భంగా బూతులు తిడుతున్న ఎమ్మెల్యేను నోరు అదుపులో పెట్టుకోవాలని రేవంత్ అనకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానం మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు.
బడా గణేష్ ముందు.. దానం నాగేందర్ బూతులు..! pic.twitter.com/X5GG5fwRKJ — News Line Telugu (@NewsLineTelugu) September 7, 2024