Game Changer: ఓటీటీలోకి వచ్చేస్తున్న గేమ్ ఛేంజర్ !

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంద‌ని అమెజాన్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది


Published Feb 04, 2025 04:09:00 PM
postImages/2025-02-04/1738665597_681235game.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , డైరక్టర్ శంకర్ కాంబో లో వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్ ..ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆడియన్స్ ముందుకు వచ్చింది.ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ నెల 7 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంద‌ని అమెజాన్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఈ సినిమా రిలీజ్ అయిన 28 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది.


కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నంద‌న్‌, అప్ప‌న్న పాత్రల్లో రామ్ చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టారు. చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఇక చెర్రీకి జోడీగా కియారా అద్వానీ నటించారు. ఈ సినిమాను శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించ‌గా.. స‌ముద్ర‌ఖ‌ని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.   ఈ సినిమా యావరేజ్ టాక్ తో జస్ట్ 28 రోజులకే ఓటీటీలోకి వస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu amazon-prime game-changer ramcharan

Related Articles