ఈ కార్యక్రమాలను వివేకానంద ఆడిటోరియం రామకృష్ణ మఠంలో నిర్వహిస్తారని అధ్యక్ష స్వామి బోధమయానంద ఒక ప్రకటనలో తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు (2వ దశ) కార్యక్రమాలను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను వివేకానంద ఆడిటోరియం రామకృష్ణ మఠంలో నిర్వహిస్తారని అధ్యక్ష స్వామి బోధమయానంద ఒక ప్రకటనలో తెలిపారు. 27 జూలై 2024 (శనివారం) "భారతదేశం విద్యా విజన్, విద్యావేత్తల పాత్ర"పై జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. 28 జూలై 2024 (ఆదివారం) హాఫ్-డే స్పిరిచ్యువల్ రిట్రీట్ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది.
ఈ వేడుకల్లో ప్రారంభోపన్యాసం స్వామి బోధమయానంద ఇవ్వనున్నారు. చీఫ్ గెస్టుగా ఇండియన్ ఇనిస్టిట్యూల ఆఫ్ టెక్నాలజీ తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ బి.ఎస్. మూర్తి హాజరుకానున్నారు. ప్రత్యేక ఉపన్యాసం స్వామి ముక్తిదానంద ఇవ్వనున్నారని స్వామీజీ తెలిపారు. ఈ వేడుకల్లో యూత్, విద్యార్థులు, భక్తులు పాల్గొని మూర్తి త్రయం కృప పొందాలని కోరారు.