మన ఇండియాలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. నాలుకపై పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఏదన్నా మనకు జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఆ విధంగానే తలలో రెండు సుడులు ఉంటే వారికి రెండు పెళ్లిళ్లు అవుతాయని అపోహ కూడా పూర్వకాలం నుంచి వస్తోంది. మరి నిజంగానే తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా. ఆ వివరాలు ఏంటో చూసేద్దామా..దీనికి ప్రధాన కారణం జన్యు లోపమని అంటుంటారు. మన పూర్వీకులకు ఎవరికైనా రెండు సుడులు ఉంటే అవి వారి ముందు తరం వారికి కూడా వస్తాయట. ఇలా ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి కాదు కానీ, ఇవి రెండు ఉండడంవల్ల రెండు వివాహాలు అవుతాయని గ్రామీణ ప్రాంతాల్లో భావిస్తూ ఉంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే అని, ఇంతవరకు నిజాలు రుజువు కాలేదని కొంతమంది చెబుతూ ఉంటారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా రెండు సుడులు ఉన్న వ్యక్తులు చాలా ఓపికగా మంచి గుణంతో ఉంటారని అంటుంటారు. వీరిలో సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుందట
న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియాలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. దీని ప్రకారమే కాలికి కానీ, చేతికి కానీ ఎక్స్ట్రా వేళ్ళు ఉంటే చాలా అదృష్టవంతుడు అని అంటూ ఉంటారు. అంతేకాకుండా నాలుకపై పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఏదన్నా మనకు జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఆ విధంగానే తలలో రెండు సుడులు ఉంటే వారికి రెండు పెళ్లిళ్లు అవుతాయని అపోహ కూడా పూర్వకాలం నుంచి వస్తోంది.
మరి నిజంగానే తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా. ఆ వివరాలు ఏంటో చూసేద్దామా.. ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాలో ఐదు శాతం మందికి తలలో రెండు సుడులు ఉంటాయట. దీనికి ప్రధాన కారణం జన్యు లోపమని అంటుంటారు. మన పూర్వీకులకు ఎవరికైనా రెండు సుడులు ఉంటే అవి వారి ముందు తరం వారికి కూడా వస్తాయట. ఇలా ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి కాదు
కానీ ఇవి రెండు ఉండడంవల్ల రెండు వివాహాలు అవుతాయని గ్రామీణ ప్రాంతాల్లో భావిస్తూ ఉంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే అని, ఇంతవరకు నిజాలు రుజువు కాలేదని కొంతమంది చెబుతూ ఉంటారు. కేవలం నమ్మకాల మీద మాత్రమే ఆధారపడి ఉన్నదని నమ్ముతారు. రెండు సుడులు ఉన్నటువంటి పురుషులు వివాహం కుదిరిన తర్వాత అది చెడిపోయి, మరో పెళ్లి చేసుకుంటారని అంటుంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా రెండు సుడులు ఉన్న వ్యక్తులు చాలా ఓపికగా మంచి గుణంతో ఉంటారని అంటుంటారు. వీరిలో సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా వీరు గొడవలకు కొట్లాటలకు దూరంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.