మన శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఉపరితిత్తులు ఎంత బాగుంటే మన ఆరోగ్యం అంతా బాగున్నట్టు. ఎందుకంటే ఊపిరితిత్తుల ద్వారానే మన
న్యూస్ లైన్ డెస్క్: మన శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఉపరితిత్తులు ఎంత బాగుంటే మన ఆరోగ్యం అంతా బాగున్నట్టు. ఎందుకంటే ఊపిరితిత్తుల ద్వారానే మన శరీరానికి ఆక్సిజన్ సరాపర అనేది ఉంటుంది. అలాంటి ఊపిరితిత్తులు పాడైతే మన జీవితం ముగిసినట్టే. ప్రస్తుత కాలంలో చాలామంది ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీనికి ప్రధాన కారణం మన వాతావరణంలో ఉండే కాలుష్యం లేదంటే కొంతమంది పొగ తాగడం వల్ల ఈ వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. అలాంటి ఊపిరితిత్తులు ఇలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం ఈ పదార్థాలు తినాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
చిలకడదుంప:
మనకు శరీరానికి ఎంతో మేలు చేసే కూరగాయలు, చిలకడదుంప కూడా ఒకటి. సీజనల్ గానే లభిస్తుంది. అలాంటి చిలకల దుంపలు తినడం వల్ల మన ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యంగా ఉంటాయట. వీటిలో ఉండే బీటా కెరటిన్ ఊపిరితిత్తుల్లోని మలినాలను బయటకు పంపిస్తాడట.
యాంటీ ఆక్సిడెంట్లు:
ముఖ్యంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే తాజా కూరగాయలు, పండ్లు, నట్స్ ఎక్కువగా తినాలట. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించి క్లీన్ గా ఉండేలా చేస్తాయట.
పండ్లు:
మీయొక్క ఊపిరితిత్తులు క్లీన్ అవ్వాలంటే తప్పనిసరిగా విటమిన్ సి ఉండే పండ్లను తీసుకోవాలట. ముఖ్యంగా ఆరెంజ్, స్ట్రాబెర్రీ, నారింజ పండ్లు, నిమ్మకాయలు, క్యాప్సికం వంటివి తింటే మీ లంగ్స్ వజ్రంలా మెరిసిపోతాయట.