ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 6,000 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే, డెంగ్యూ కేసుల సంఖ్యను కూడా ప్రభుత్వం దాచిపెట్టాలని ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు, మరణాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 6,000 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే, డెంగ్యూ కేసుల సంఖ్యను కూడా ప్రభుత్వం దాచిపెట్టాలని ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.
గత 5 రోజుల్లోనే 800 కొత్త డెంగ్యూ కేసులు నమాదైనట్లు ఫ్యామిలీ & వెల్ఫేర్ డైరెక్టర్ నిర్దారించారని కేటీఆర్ గుర్తుచేశారు. డెంగ్యూ విషయంలో సర్కార్ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైరల్ ఫీవర్లు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే కేసుల లెక్కలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఇది దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారదర్శకంగా విష జ్వరాల నివారణ కోసం చర్యలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు.