చెట్టు 300 సినిమాల్లో నటించిందా...అనుకోకండి. నిజంగానే ఈ చెట్లు 300 సినిమాల్లో కనిపించింది. 150 ఏళ్ల నుంచి బతికే ఉంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చెట్టు 300 సినిమాల్లో నటించిందా...అనుకోకండి. నిజంగానే ఈ చెట్లు 300 సినిమాల్లో కనిపించింది. 150 ఏళ్ల నుంచి బతికే ఉంది. గోదావరి నది గట్టున ఉన్న ఈ సినిమా చెట్టు కథ చదివేద్దాం రండి..
అదో సినీ మహా వృక్షం. …సినిమా పక్షులకు కూడా షూటింగ్ స్పాట్‌గా మారింది. సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్. అక్కడ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని నమ్మకం. ఈ నమ్మకం కూడా తెలుగు ఇండస్ట్రీ లో ది గ్రేట్ డైరక్టర్ కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు , వంశీ మొదలుపెట్టిందే . గోదావరి కనిపిస్తే ఈ చెట్టు కనిపించాల్సిందే. ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని చెబుతారు. దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట. శంకరాభరణం, సీతారామయ్య గారి మనవరాలు, త్రిశూలం, పద్మవ్యూహం, మూగ మనసులు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లు ఉంటాయి. 150 సంవత్సరాల వయస్సున్న ఈ చెట్టు దగ్గర దాదాపు 300 సినిమాల షూటింగ్‌లు జరగడం విశేషం. ఇన్నేళ్ల చరిత్ర ఉన్న చెట్టు నిన్ననే కూలిపోయింది.
ఈ చెట్టు కుమారదేవం గ్రామంలో ఉంది. ఈ చెట్టు తమ ఊరికి ఎంతో పేరు తెచ్చిందని, అది కూలిపోవడం బాధ కలిగిస్తోందంటున్నారు కుమారదేవం గ్రామస్తులు.1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి నిన్నమొన్నటి రంగస్థలం మూవీ వరకు అందరు ఈ చెట్టు ను సినిమాల్లో చూపించిన వారే. ఇంత చరిత్ర ఉన్న చెట్టు కూలిపోవడం చాలా బాధగా ఉందంటున్నారు గ్రామస్థులు.