నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుండగానే బయటకు వచ్చేసిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపుతున్నారని ఆమె మండిపడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో నేడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది. 2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై నీతి అయోగ్ సమావేశంలో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, నీతి ఆయోగ్ సమావేశాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాయ్‌కాట్ చేసినట్లు తెలుస్తోంది.
సమావేశంలో తనకు అవమానం జరిగిందంటూ ఆమె నీతి ఆయోగ్ నుండి వాక్ ఔట్ చేసినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుండగానే బయటకు వచ్చేసిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపుతున్నారని ఆమె మండిపడ్డారు.
సభలో మాట్లాడాలని అనుకున్నట్లు ఆమె వెల్లడించారు. కానీ, ఆమె మాట్లాడడం మొదలు పెట్టిన ఐదు నిమిషాలకే మైక్ ఆఫ్ చేసేశారని మమతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంటే ముందు మాట్లాడిన వారంతా 10 నుంచి 20 నిమిషాల వరకు మాట్లాడారని వెల్లడించారు. ప్రతిపక్షం నుంచి తాను ఒంటరిగా వచ్చానని తెలిపారు. అయినప్పటికీ మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. సభలో జరిగింది తనకు తీవ్ర అవమానాన్ని కలిగించిందని మమత అన్నారు.
నీతి ఆయోగ్ రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని డిమాండ్ చేశారు. ద్రం వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా రాజకీయంగానే ఉందని మమత విమర్శించారు. నీతి ఆయోగ్‌కు ఆర్థిక అధికారాలు లేవు, ఇది ఎలా పనిచేస్తుంది? అని ప్రశ్నించారు. దయచేసి దీనికి ఆర్థిక అధికారాలు అందించాలని, లేదా ప్లానింగ్ కమిషన్‌ను తిరిగి తీసుకురావాలని అన్నారు.