sweets: టేస్టీ టేస్టీ...మోతీచూర్ లడ్డూ ఇలా తయారుచెయ్యండి !

ఇంట్లోని పదార్థాలతోనే బూందీ గరిటెతో పని లేకుండా చాలా క్విక్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు


Published Apr 24, 2025 04:15:00 PM
postImages/2025-04-24/1745491620_LaduFeaturedImage.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మోతీచూర్ లడ్డూ ఎంతమందికి ఫేవరేట్..అసలు ఇట్టే కరిగిపోయే లడ్డూలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దీని తయారీకి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ఇంట్లోని పదార్థాలతోనే బూందీ గరిటెతో పని లేకుండా చాలా క్విక్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ గా హెల్దీగా ఈ లడ్డూను పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు.


పావుకిలో - శనగపిండి


ఒకటిన్నర కప్పులు - వాటర్(తగినన్ని)


పాకం కోసం :


చక్కెర - 400 గ్రాములు


పావు టీస్పూన్​ - ఆరెంజ్​ లేదా యెల్లో ఫుడ్​ కలర్​


ఒక టీస్పూన్​ - యాలకుల పొడి


ఒక టేబుల్​ స్పూన్​ - నెయ్యి


ఒక టీస్పూన్​ - పుచ్చపప్పు


ఎలా తయారుచేసుకోవాలి..


ఫస్ట్ ఎలా తయారుచేసుకోవాలంటే 


ఫస్ట్ శనగపిండిని జల్లించుకొండి..కాస్త నీరుపోసుకొని జారుగా కలుపుకొండి. దోశకు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొండి. మరీజారుగా అయితే కాస్త పిండి ఉండలు లేకుండా జల్లించుకొండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని లడ్డూ కి బూందీ రెడీ చేసుకొండి. ఎలా అంటే..నూనె బాగా కాగాలి. బూందీ గరిటె ఉంటే సరి..లేకపోతే ..చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకొని డీప్ ఫ్రై అయ్యాక బయటకు తీసి ...కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే సరి. అలా మిక్సీ పట్టుకున్న బూందీ పొడిని వెడల్పుగా ఉన్న ఓ ప్లేట్ లోకి తీసుకొండి.


​ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ ​మీద పాన్ పెట్టుకొని అందులో చక్కెర, నీళ్లు వేసి మంట​ను హై టూ మీడియం ఫ్లేమ్​కి అడ్జస్ట్​ చేసుకుంటూ పంచదారను పూర్తిగా కరిగించుకోవాలి. అయితే సరిగ్గా తీగ పాకం వచ్చాక గరిటెతో చేతి వేళ్లతో టచ్ చేస్తే మీరు జిగురుగా తీగలు సాగుతూ రావాలి. అప్పుడు మీకు లడ్డూకు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. ఇప్పుడు ఒక చెంచా యాలకుల పొడి వేసుకొని ఫుడ్ కలర్ కావాలంటే వేసుకొండి లేదంటే వేసుకోకండి...ఇప్పుడు మీరు మిక్సీ పట్టుకొని బరకగా చేసుకున్న బూందీ పొడిని పాకం తో కలిపి స్టవ్ మీద ఉడికించుకొండి. నాలుగు నిమిషాలు చాలు. ఇప్పుడు మీరు నెయ్యి వేసుకొని కాసింత జీడిపప్పు వేసుకుంటే సరి ..మీరు అనుకున్న టేస్టీ మోతీచూర్ లడ్డు రెడీ.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sweets tasty-food- laddu

Related Articles