నిత్యామీనన్ అవార్డులను అందుకున్నారు. కార్తీకేయ 2 దర్శకుడు చందూ మొండేటి నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎట్టకేలకు నిత్యామీనన్ కు నేషనల్ అవార్డు అందింది. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలను అందజేస్తున్నారు. నిత్యామీనన్ అవార్డులను అందుకున్నారు. కార్తీకేయ 2 దర్శకుడు చందూ మొండేటి నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు.
నిత్యామీనన్ తో పాటు ..కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కూడా అవార్డు అందుకున్నారు. మిథున్ చక్రవర్తి దాదా సాహెచ్ ఫాల్కే పురస్కారం స్వీకరించారు. 2022 కి గాను ఈ అవార్డులు అందుకుంటున్నారు. ఉత్తమ నటుడిగా రిషబ్‌శెట్టి (కాంతార), ఉత్తమ నటిగా నిత్యా మేనన్ (తిరుచిత్రంబలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్' (మలయాళం), తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'కార్తికేయ 2' నిలిచిన సంగతి తెలిసిందే.
తన కష్టానికి ఇన్నాళ్లకు ప్రతిఫలం దక్కిందని హ్యాపీ గా ఫీలయ్యింది నిత్యామీనన్. తనతో పాటు నేషనల్ అవార్డు అందుకున్నవారందరికి కంగ్రాట్స్ తెలిపింది.'పొన్నియిన్ సెల్వన్- 1' చిత్రానికి గానూ ఉత్తమ సంగీతం విభాగంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ అవార్డును అందుకున్నారు. ఏ ఆర్ రెహ్మాన్ కు ఏడో నేషనల్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
#WATCH | 70th National Film Awards | Rishab Shetty awarded the Best Actor in Leading Role for his performance in the movie 'Kantara'
(Video source: DD News/YouTube) pic.twitter.com/YMStTzDyDz — ANI (@ANI) October 8, 2024