రాంగోపాల్ వర్మ చాలా స్పెషల్ సినిమాలను తీయడంలో దిట్ట అని చెప్పవచ్చు. పుట్టలోంచి పామును తీసి నాట్యం మాడించగల దీరుడు అని చెప్పవచ్చు. అలాంటి ఆర్జీవి ఏ చిత్రం చేసిన అందులో
న్యూస్ లైన్ డెస్క్: రాంగోపాల్ వర్మ చాలా స్పెషల్ సినిమాలను తీయడంలో దిట్ట అని చెప్పవచ్చు. పుట్టలోంచి పామును తీసి నాట్యం మాడించగల దీరుడు అని చెప్పవచ్చు. అలాంటి ఆర్జీవి ఏ చిత్రం చేసిన అందులో కొత్తవారిని నటింపజేస్తారు. అంతే కాదు తన సినిమాల్లో కూడా కొత్తదనాన్ని చూపిస్తారు. అయితే రాంగోపాల్ వర్మ డెన్ నుంచి తాజాగా శారీ అనే మూవీ వస్తోంది. ఈ సినిమాకి గిరి కృష్ణకమల్ అనే వ్యక్తి డైరెక్షన్ చేస్తున్నారు. ఆర్జీవి ఆర్వి ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ బిజినెస్ మాన్ రవివర్మ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
పలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్ గా "శారీ" మూవీ రాబోతోంది. అయితే అలాంటి ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయిందని ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా సరికొత్త సాంగ్ బయటకు వచ్చింది. అయితే ఈ సాంగ్ చాలా స్పెషల్ గా కంపోజ్ చేశారట. ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలోనే ఎవరు కూడా ఈ విధంగా చేయలేదట. ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ సాంగ్ క్రియేట్ చేశారట. దీని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఏఐ జనరేట్ చేసిందే ఉందట.
అయితే ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ రాబోవు కాలంలో ఏఐ అనేది చాలా దూసుకుపోతుందని సంగీతాన్ని బేస్ చేసుకుని బ్రతికే వారిని ఏఐ దెబ్బతీస్తుందని తెలియజేశారు. ఈ టెక్నాలజీ ద్వారా వారంలో చేసే పని రెండు రోజుల్లో చేయవచ్చట. అంతేకాదు ఖర్చుతోపాటు పని భారం కూడా తగ్గుతుందట. టెక్నాలజీ ద్వారా మనం దేశంలోని ఏ సంగీత దర్శకుడు వాయిస్ అయినా సరే తీసుకొని మ్యూజిక్ కంపోజ్ చేస్తుందట. శారీ మూవీ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఏఐ ద్వారానే చేయబడిందని తెలుస్తోంది.
ఏఐ టెక్నాలజీ ద్వారా మొదటిసారి సంగీతాన్ని అందించిన చిత్రం శారీ అని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో కీలక పాత్రలో సత్య యాదు నటిస్తుండగా, హీరోయిన్ గా ఆరాధ్య దేవి చేస్తుందట.
https://x.com/RGVzoomin/status/1836963569247883365?t=o7MgVrqA35ZmsOEjA6W_PQ&s=08