పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు వస్తే బంగారం కొనక తప్పదు. గ్రాము అయినా బంగారం కొని తీరాల్సిందే. నాలుగు రోజులు నుంచి బంగారం చాలా దారుణంగా పెరిగిపోతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరుంటారు. ప్రతి ఒక్కరికి బంగారం మీద మోజే. కాకపోతే రేట్లు చూస్తే భయమేస్తుంది. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు వస్తే బంగారం కొనక తప్పదు. గ్రాము అయినా బంగారం కొని తీరాల్సిందే. నాలుగు రోజులు నుంచి బంగారం చాలా దారుణంగా పెరిగిపోతుంది.
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి తులం రూ. 69,800 మార్కు వద్ద ఉంది. అంతకుముందు వరుసగా రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1350 పెరిగింది. 24 క్యారట్ల బంగారం పై 220 రూపాయిలు పెరిగింది. ఇప్పుడు 24 క్యారట్ల బంగారం 7600 గా మార్కెట్ ధర నడుస్తుంది.
*ఢిల్లీలోనూ పసిడి ధరలు ఎగబాకాయి. ఇక్కడ 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ. 200 పెరగడంతో తులం రూ. 69,950 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములు రూ. 76,300 పలుకుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,512 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,740 గా కొనసాగుతుంది.
*ఇక కేరళలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కేరళ రూ. 68,521 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.74,750 కొనసాగుతుంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ బంగారం ధర రూ.68,218 ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.74,420 వద్ద ఉంది.
వెండిధర మాత్రం 98 వేలు రీచ్ అయ్యింది. మరింత పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ ఇదే నడుస్తుంది.