12 ఏళ్లలోపు చిన్నపిల్లలను మధ్యాహ్నం నుంచి నడకమార్గంలో అనుమతించడం లేదు. రాత్రి 9: 30 గంటల తర్వాత అలిపిరి నడకమార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలకసూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా 12 ఏళ్లలోపు చిన్నపిల్లలను మధ్యాహ్నం నుంచి నడకమార్గంలో అనుమతించడం లేదు. రాత్రి 9: 30 గంటల తర్వాత అలిపిరి నడకమార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు.
తిరుమల నడక మార్గంలో టీటీడీ అధికారులు ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం చిరుతల సంచారమే. ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం తిరుమలలో ఎక్కువైంది. మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత సంచారంతో భక్తులు హడలిపోతున్నారు. దీని వల్ల నడకదారిలో
2023 ఆగస్టు నెలలో తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతిచెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి 8గంటల సమయంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి11గంటలకులక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఈ టైంలోనే బాలిక పై పులి దాడి చేసింది. ఆ చిన్నారి మృతి చెందింది. శుక్రవారం శ్రీవారిని 64,527 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70కోట్లు సమకూరింది.