రష్యా హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉండే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరక్టర్ ఆండ్రే చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ వ్యాక్సిన్ ను పూర్తి గా ఉచితంగా ఇస్తారట.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొన్ని లక్షల మంది ఎదురుచూస్తున్న క్షణం . ఎన్నో రకాల క్యాన్సర్లతో కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు. చావు తో పోరాడలేక ..రోగంతో చనిపోతున్నారు. వీరికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. క్యాన్సర్ ను ఢీకొట్టే MRNA వ్యాక్సిన్ ను.. అక్కడి రీసెర్చ్ సంస్థలు అన్నీ కలిసి డెవలప్ చేశాయి. కొత్త సంవత్సరంలో దేశంలో అందరికీ ఈ వ్యాక్సిన్ ను ఇవ్వబోతున్నారు. రష్యా హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉండే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరక్టర్ ఆండ్రే చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ వ్యాక్సిన్ ను పూర్తి గా ఉచితంగా ఇస్తారట.
ఈ వ్యాక్సిన్ శరీరంలో క్యాన్సర్ కణాలను గుర్తిస్తుంది. దానిని ఢీకొట్టి.. నాశనం చేసేలా.. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను రెడీ చేస్తుంది. సో.. సింపుల్ గా చెప్పాలంటే MRNA వ్యాక్సిన్ చేసే పని ఇదే.ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ కణుతులు అభివృధ్ధి చెందకుండా చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. అక్కడి క్లినికల్ ట్రయల్స్ లో నిరూపణ కూడా అయ్యింది. అందుకే ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి చెప్పారు. తాము క్యాన్సర్ వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్నామని గర్వంగా చెప్పారు.
*బ్రెయిన్ క్యాన్సర్ లో ఓ రకమైన గ్లియోబ్లాస్టోమాకు కూడా వ్యాక్సిన్ ను డెవలప్ చేశారు. దీనిని టెస్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది.
*ఇక చర్మ క్యాన్సర్ అయిన మెలనోమాకు యూకేలో ఓ వ్యాక్సిన్ ను తయారుచేశారు. దీనిని కూడా టెస్ట్ చేశారు
క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే దానిని తొలగించేలా.. క్యాన్సర్ కణతులు స్పీడ్ గా పెరగకుండా వాటిని అడ్డుకునేలా.. ఇవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.