తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉంది అంటే ఇందులో ప్రధాన పాత్ర సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఆయన ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎంతో ఎదిగేలా చేశారు. అలాంటి
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉంది అంటే ఇందులో ప్రధాన పాత్ర సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఆయన ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎంతో ఎదిగేలా చేశారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ చేయని పాత్ర లేదు. పౌరాణిక సినిమా కానీ, యాక్షన్, కామెడీ ఇలా ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతారు. అలాంటి ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు. ఈ విధంగా ఎంతో ఎదిగిన ఆయన ఎంతో సిస్టమేటిక్ గా ఉండేవారట.
ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి తన పనులు మొదలుపెట్టేవారట. మళ్లీ రాత్రి 12 గంటల సమయం వరకు ఆయన షూటింగుల్లోనే ఉంటూ రోజుకు రెండు షిఫ్టులైన చేసేవారట. ఈ విధంగా ఎంతో గౌరవం తెచ్చుకున్నటువంటి ఎన్టీఆర్ ఫుడ్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గేవారుకాదట. ఈయనను భోజన ప్రియుడు అని కూడా పిలిచేవారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి వ్యాయామం చేసి స్నానమాచరించేవారట.
తర్వాత 24 ఇడ్లీలు తిని, ఆ తర్వాత భోజనం కూడా చేసేవారట. అలా తన దినచర్య మొదలుపెట్టి మధ్యాహ్న సమయంలో తాను తినే భోజనంలో మాంసాహారం ఉండాలట. ఇదే కాకుండా ప్రతిరోజు రెండు లీటర్ల బాదంపాలు తాగేవారట. అలాంటి ఎన్టీఆర్ బజ్జీలు అంటే ఎంతో ఇష్టపడతారట. ఆయన ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ 40 నుంచి 50 బజ్జీలను సునాయాసంగా ఆరగించేవారట.
అంతేకాదు ఆయన రెండో భార్యగా చేసుకున్న లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ కు అద్భుతమైన ఆహార పదార్థాలు వండిపెట్టేదట. అంతేకాకుండా ఆమెనే స్వయంగా ఎన్టీఆర్ కు తినిపించేదట. ఈ విధంగా ఎన్టీఆర్ ఏ విషయంలో అయినా ప్రత్యేకత సంతరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల దేవుడయ్యారు.