సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని సామెత ఊరికే రాలేదు. సంగీతం వినడం వల్ల మనకు మనసు కుదుటపడడమే కాకుండా ఏదైనా బాధల నుంచి కూడా తేరుకోవచ్చు. ముఖ్యంగా మ్యూజిక్ అనేది వినడం వల్ల మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. అలాంటి మ్యూజిక్ వింటే మానవునికి ఎనిమిది అద్భుత ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూస్ లైన్ డెస్క్:సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని సామెత ఊరికే రాలేదు. సంగీతం వినడం వల్ల మనకు మనసు కుదుటపడడమే కాకుండా ఏదైనా బాధల నుంచి కూడా తేరుకోవచ్చు. ముఖ్యంగా మ్యూజిక్ అనేది వినడం వల్ల మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. అలాంటి మ్యూజిక్ వింటే మానవునికి ఎనిమిది అద్భుత ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి:
ముఖ్యంగా మ్యూజిక్ వినడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మధురమైన మెలోడీ సాంగ్స్ వింటే స్ట్రెస్ కారణమైన కార్టీసాల్ తగ్గి టెన్షన్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
డిప్రెషన్:
సంగీతం అనేది వినడం వల్ల ఆందోళన డిప్రెషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. మ్యూజిక్ మెడిటేషన్ మాదిరిగా మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
హ్యాపీ ఆర్మోన్స్ :
ముఖ్యంగా మధురమైన మ్యూజిక్ వినడం వల్ల హ్యాపీ హార్మోన్స్ మెరుగుపడతాయి. ఇది డొపమైన్ ఉత్పత్తిని పెంచి మానస్తిక స్థితిని మెరుగుపరుస్తుంది.
ఏకాగ్రత:
సంగీతం అనేది వినడం వల్ల మీకు పని పైన ఏకాగ్రత పెరుగుతుంది. బాగా ఆలోచించేందుకు మీ మనసును కుదుట పడేస్తుంది.
స్లీపింగ్:
మనకి ఇష్టమైన మెలోడీ సాంగ్స్ వింటూ ఉంటే నిద్ర స్థాయిలు కూడా జరుగుతాయి. మనసుకు ప్రశాంతత అందించి నిద్ర ఈజీగా పట్టేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యం:
మరి ముఖ్యంగా మ్యూజిక్ వినడం వలన మనకు ఆందోళన తగ్గుతుంది. కార్టీసాల్ హార్మోన్ తగ్గి ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా రక్తపోటు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. రక్తంలోని సెరోటోనిన్, ఎండార్పిన్ ను పెంచి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
జ్ఞాపకశక్తి :
మ్యూజిక్ అనేది జ్ఞాపక శక్తిని పెంచి అద్భుతంగా అన్ని గుర్తుండేలా చేస్తుంది. అంతేకాకుండా అల్జిమర్స్ వ్యాధుల ప్రభావం నుంచి కూడా కాపాడుతుంది.
వ్యాయామం:
వ్యాయామం చేసే సమయంలో ఎనర్జిటిక్ సాంగ్స్ వినడం వల్ల వ్యాయామం మరింత ఉత్సాహంగా చేస్తారు. మీలో మరింత ఓర్పు పెరుగుతుంది.