corona: రోజురోజుకి విజృంభిస్తున్న కోవిడ్ ..24 గంటల్లో 498 కేసులు !

ఈ వైరస్ నుంచి రీసెంట్ గా 4,724 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 55 మంది కరోనా వల్ల చనిపోయినట్లు కూడా పేర్కొన్నారు.


Published Jun 06, 2025 05:17:00 PM
postImages/2025-06-06/1749210503_20250519154441covid19.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ లో కరోనా మహమ్మారి పెరుగుతుంది. రీసెంట్ గా కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 5,000 మార్కును దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,364గా ఉంది. 


ఈ వైరస్ నుంచి రీసెంట్ గా 4,724 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 55 మంది కరోనా వల్ల చనిపోయినట్లు కూడా పేర్కొన్నారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 498 కరోనా కేసులు నమోదు కాగా అదే టైంలో నలుగురు కోవిడ్ తో మరణించారు. మృతులలో ఇద్దరు కేరళకు చెందినవారు కాగా, కర్ణాటక మరియు పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం అత్యధిక యాక్టివ్ కేసులు కేరళలో ఉన్నాయి. 


ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులున్నాయంటే ...


* కేరళ -1679


* గుజరాత్ – 615 


* పశ్చిమ బెంగాల్ – 596 


*మహారాష్ట్ర – 548 


*ఢిల్లీ – 562 


*కర్ణాటక – 451 


*తమిళనాడు – 221 


*ఉత్తరప్రదేశ్ – 205 


* రాజస్థాన్ – 107 తెలుగు రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు కనిపిస్తున్నప్పటికీ, అధికారికంగా రాష్ట్ర వారీగా పూర్తిగా లెక్కలు వెల్లడించలేదు. కేసులు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రజలు మాస్క్ లు వేసుకోవడం లేదు. హైజీన్ మెయింటైన్ చెయ్యాలని ..సానిటైజర్స్ వాడడంలేదు. భౌతిక దూరం పాటించడం లేదు లాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health covid-time

Related Articles