చైనాలోని గబ్బిల్లాల్లో ఫస్ట్ టైం గుర్తించిన ఈ వైరస్ లు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అందోళనకర సంకేతాలను చూపుతున్నాయని పరిశోధకులు తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రపంచాన్ని ఇప్పటికే చాలా సార్లు టెన్షన్ పెట్టిన కరోనా వైరస్ తన ఫ్యామిలీ నుంచి మరో వైరస్ ను బయటపెట్టింది. ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ కు దగ్గరి సంబంధం ఉన్న కొన్ని రకాల గబ్బిలాల వైరస్ లు ముఖ్యంగా 'హెచ్కేయూ5’ అనే ఉపరకం. కేవలం ఒక జన్యు మార్పు తో మానవ కణాలలోకి ప్రవేశించి తదుపరి ప్రపంచ మహమ్మారి క్రియేట్ చేసే అవకాశముందంటున్నారు శాస్త్రవేత్తలు. చైనాలోని గబ్బిల్లాల్లో ఫస్ట్ టైం గుర్తించిన ఈ వైరస్ లు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అందోళనకర సంకేతాలను చూపుతున్నాయని పరిశోధకులు తెలిపారు.
వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నేతృత్వంలో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్ప్ తో నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచరితమయ్యాయి. ఈ కొత్తగా వచ్చిన వైరస్ పేరు మెర్స్ వైరస్ ...ఈ వైరస్ కూడా కోవిడ్ ఫ్యామిలీకి చెందినదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెర్స్ సోకిన వారిలో మరణాల రేటు సుమారు 34 శాతం వరకు ఉంటుంది.
ఈ వైరస్లను తొలుత జపనీస్ హౌస్ గబ్బిలాల్లో (పిపిస్ట్రెల్లస్ అబ్రామస్) కనుగొన్నారు"ఈ వైరస్లు మెర్స్కు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి, కాబట్టి అవి ఎప్పుడైనా మానవులకు సోకితే మనం ఆందోళన చెందాల్సి ఉంటుంది" అని లెట్కో హెచ్చరించారు. "అవి ఇప్పటివరకు మనుషుల్లోకి ప్రవేశించినట్లు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, ఆ సామర్థ్యం వాటికి ఉంది. అందుకే వాటిపై నిఘా ఉంచడం చాలా అవసరం" అని ఆయన తెలిపారు. అసలు ఏఐ సాయంతో ఈ వైరస్ లు ఎంత స్పీడ్ లో వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని అరికట్టడానికి ఏమైనా సులువైన పధ్ధుతులు ఉన్నాయా. ఆయుర్వేదం , హోమియో , ఇంగ్లీష్ మెడిసన్ లో ఏదైనా ఉన్నాయా అనేది ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.