Bone cancer: మెయిన్ బోన్ క్యాన్సర్ లక్షణాలివే !

బోన్ క్యాన్సర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాత్రం అనుమానున్న వెంటనే చెక్ చేయించుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి..


Published Jun 10, 2025 01:34:00 PM
postImages/2025-06-10/1749542719_bonecancerblog.png.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఎముకలో కణితులు ఏర్పడటాన్ని ఎముక క్యాన్సర్ అంటారు. దీనికి ప్రధాన కారణంఇదే అనే లేదు. కానీ DNA వచ్చే లో మార్పుల కారణంగానే ఈ సమస్య వస్తుందిఅంటున్నారు డాక్టర్లు. అయితే ఈ వ్యాధి నిర్ధారణలో మాత్రం కొన్ని ముందస్తు లక్షణాలు కూడా ఉండవు. సడన్ గా క్యాన్సర్ కణాలు పెరిగి వ్యాధి తీవ్రతను పెంచుతాయి. ఈ ముదిరిన తర్వాత మాత్రమే దీని తీవ్రత తెలుస్తుంది. అందుకే బోన్ క్యాన్సర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాత్రం అనుమానున్న వెంటనే చెక్ చేయించుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి..


ఆస్టియోసార్కోమా: ఇది చాలా సాధారణమైన ఎముక క్యాన్సర్ . సాధారణంగా టీనేజర్స్ లో కనిపిస్తుంది.  


ఎవింగ్ సార్కోమా: ఇది ఎముకలలో మరియు చుట్టుపక్కల ఉండే మృదు కణజాలంలో ఏర్పడుతుంది. ఇది కూడా ఎక్కువ టీనేజర్స్ లో , పిల్లల్లో కనిపిస్తుంది. ఈ కణుతులు , కీళ్లు  ఎముకల మధ్య కదలికకు సహాయపడే మృదువైన కణజాలంలో ఏర్పడుతుంది. పెద్ద వయసు వారిలో కూడా ఈ సమస్య వస్తుంది.


ఎముక క్యాన్సర్ లక్షణాల్లో మొదటిది కణితులు ఏర్పడి క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఎముక నొప్పి కూడా క్రమంగా పెరిగి విపరీతంగా మారుతుంది. రాత్రి పూట మరింత ఎక్కువగా ఉంటుంది.  ఈ క్యాన్సర్లకు చికిత్స లింబ్-స్పేరింగ్ సర్జరీ. దీనిలో కణితిని మరియు దాని చుట్టూ ఉన్న కొంత ఆరోగ్యకరమైన కణజాలాన్ని తొలగిస్తారు. సమస్య తీవ్రతను బట్టి కొన్ని సార్లు అవయవాలను కూడా తొలగించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits cancer bone-cancer

Related Articles