సాధారణంగా చాలామంది రాత్రి సమయంలో నిద్రించే ముందు లైటు తీసేసి పడుకుంటారు. కొంతమంది లైట్ ఉంటేనే నిద్రపోతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్క విధమైన అలవాటు ఉంటుంది. మరి ఇందులో లైట్ ఉన్నప్పుడు నిద్రిస్తే మంచిదా? లేదంటే లైట్ లేనప్పుడు నిద్రిస్తే మంచిదా?అనే దానిపై కొంతమంది సైంటిస్టులు ఒక అధ్యయనం నిర్వహించారట. మొత్తం 87 వేల మందిపై 8 సంవత్సరాల పాటు నిర్వహించిన ఈ అధ్యాయంలో కొన్ని సరికొత్త విషయాలు బయటకు వచ్చాయి.బ్రిటన్ సైంటిస్టులు ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఒక అధ్యయనంలో తెలియజేశారు. మొత్తం 87 వేల మంది స్త్రీ, పురుషులపై ఈ సర్వే చేశారు.ఎక్కువ వెలుతురు ఉన్న గదిలో నిద్రించిన వారికి డయాబెటిస్ రిస్క్ అనేది పెరిగిందని, తక్కువ వెలుతురు ఉన్న గదిలో నిద్రించిన వారికి డయాబెటిస్ కాస్త తగ్గిపోయిందని తెలియజేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా చాలామంది రాత్రి సమయంలో నిద్రించే ముందు లైటు తీసేసి పడుకుంటారు. కొంతమంది లైట్ ఉంటేనే నిద్రపోతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్క విధమైన అలవాటు ఉంటుంది. మరి ఇందులో లైట్ ఉన్నప్పుడు నిద్రిస్తే మంచిదా? లేదంటే లైట్ లేనప్పుడు నిద్రిస్తే మంచిదా?అనే దానిపై కొంతమంది సైంటిస్టులు ఒక అధ్యయనం నిర్వహించారట. మొత్తం 87 వేల మందిపై 8 సంవత్సరాల పాటు నిర్వహించిన ఈ అధ్యాయంలో కొన్ని సరికొత్త విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం..
సాధారణంగా చాలామంది డయాబెటిస్ తో బాధపడుతూ ఉంటారు. దీన్ని తగ్గించుకోవడం కోసం అనేక కసరత్తులు చేయడం, విటమిన్స్ ఉండే ఆహారం తీసుకోవడం, బరువు తగ్గడం వంటి కసరత్తులు చేస్తూ ఉంటారు. వీటన్నిటికంటే ఒక సులభమైనటువంటి పని చేయడం వల్ల డయాబెటిస్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని బ్రిటన్ సైంటిస్టులు ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఒక అధ్యయనంలో తెలియజేశారు. మొత్తం 87 వేల మంది స్త్రీ, పురుషులపై ఈ సర్వే చేశారు. ఇందులో ముఖ్యంగా రాత్రి 12:30 నుంచి ఉదయం 6 గంటల వరకు వారి యొక్క నిద్రలను పరిశీలించారు.
ఇందులో ఎక్కువ వెలుతురు ఉన్న గదిలో నిద్రించిన వారికి డయాబెటిస్ రిస్క్ అనేది పెరిగిందని, తక్కువ వెలుతురు ఉన్న గదిలో నిద్రించిన వారికి డయాబెటిస్ కాస్త తగ్గిపోయిందని తెలియజేశారు. వారు చెప్పిన దాని ప్రకారం రాత్రిళ్ళు గదిలో వెలుతురు అనేది మన రక్తంలోని చక్కెర నియంత్రణ వంటి మరియు జీవక్రియలు వంటి వాటిపై ఆధారపడి ఉంటాయట. ఇది మెదడుతో సంబంధం కలిగి కొన్ని హార్మోన్లను విడుదల చేస్తాయట. ఇది కూడా రాత్రిళ్ళు కనిపించే వెలుతురుపైనే ఆధారపడి ఉంటాయని వారు తెలియజేశారు.
మొత్తం ఈ అధ్యయనాన్ని స్త్రీ, పురుషులపై 8 సంవత్సరాల పాటు చేశారు. ఇందులో ప్రతి ఒక్కరి చేతికి ప్రత్యేకమైన సెన్సార్లు ఉన్న గడియారాన్ని అమర్చారు. ఇలా రోజు మొత్తంలో వారిపై వెలుతురు ఎన్ని గంటలు పడుతుందో పరిశీలించారు. రాత్రిళ్ళు అత్యధిక వెలుగులో ఉన్న తొలి 10 శాతం మందిలో డయాబెటిస్ వచ్చే అవకాశం 67% ఉన్నది. తక్కువ వెలుతురులో పడుకునే వాళ్లకి డయాబెటిస్ నుంచి రక్షణ లభించిందని వారు తెలియజేశారు.