అయితే రీసెంట్ వస్తున్న ఈ కొరియన్ డైట్ మాత్రం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటున్నారు . అసలు ఈ డైట్ ఏంటో చూద్దాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బరువు తగ్గడం చాలా ఇంపార్టెంట్ . కాకపోతే చాలా మంది చాలా ఈజీగా బరువు తగ్గుతారు. కొందరు చాలా కష్టపడాల్సిందే. అయితే రీసెంట్ వస్తున్న ఈ కొరియన్ డైట్ మాత్రం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటున్నారు . అసలు ఈ డైట్ ఏంటో చూద్దాం.
* వారానికి ఒకసారి ఉపవాసం, రోజువారీ వ్యాయామం కలిపి నాలుగు వారాల బరువు తగ్గించే ప్రసిద్ధ దినచర్యను ప్రవేశపెట్టారు.
* మీరు సరిగ్గా ఫుడ్ తక్కువ తింటూ వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారు. ఇందులో తిరుగులేదు.
* డీటాక్స్ మరియు పేగు శుభ్రపరచడం మొదటి వారం పేగులను శుభ్రపరచడంపై దృష్టి పెడుతుంది. ప్రోబయోటిక్ . ప్రోటీన్ షేక్ రెండు మిస్ చెయ్యకూడదు.
* భోజనంలో దోసకాయలు, బ్రోకలీ, క్యాబేజీ, మజ్జిగ ఉండాలి.
* ఆ తరువాత నాలుగు రోజులు, చేపలు, చికెన్, గుడ్లు, పాల ఉత్పత్తులు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. లో కార్బో డైట్ ఈ వీక్ లో చేస్తారు.
* 2వ వారం: అడపాదడపా ఉపవాసం ప్రారంభించండి . రోజులో ఎక్కువ మొత్తం ఫుడ్ తక్కువ తీసుకోకండి,అధిక ప్రోటీన్ భోజనంతో ఉపవాసాన్ని ముగించండి.
*కూరగాయలు మరియు అన్నంతో పాటు ప్రతిరోజూ రెండు ప్రోటీన్ షేక్‌లను తీసుకోవడం కొనసాగించండి.
* మధ్యాహ్న భోజనంలో ఆకుపచ్చ కూరగాయలు మరియు తక్కువ కార్బ్ ఆహారాలు ఉండాలి. రాత్రి భోజనంలో అధిక ప్రోటీన్ తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.
* సిఫార్సు చేయబడిన ఆహారాలలో బ్లాక్ కాఫీ, పప్పులు, తెల్ల బియ్యం, గింజలు ఉండాలి.
ఇక మూడో వారం వారంలో రెండు రోజులు ఉపవాసం ప్లాన్ చేసుకొండి. మీ వల్ల కాకపోతే ..నాలుగు రోజులు ఒక మీల్ స్కిప్ చెయ్యండి సరిపోతుంది. చెర్రీ టమోటాలు, చెస్ట్‌నట్‌లు, బెర్రీలు, అరటిపండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తీసుకోవాలి. చిలగడదుంపల్లో ఉన్న ఫైబర్, పోషకాలు శరీరానికి శక్తిని ఇస్తాయి.
ఇక నాలుగో వారం వచ్చేసరికి ...ఫుడ్ చాలా తగ్గిపోతుంది. మీకే తేడా తెలుస్తుంది. మీ బరువు చాలా తగ్గుతుంది.వారం వారం కొత్తగా అనిపిస్తుంది. ఈ నాలుగో వారం ఆల్ మోస్ట్ లిక్విడ్ డైట్ సో మీరు బరువు తగ్గుతారు.