దీనివల్లే చాలా మంది నెగ్లెట్ చేసేస్తారు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ప్రారంభంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బ్రెయిన్ ట్యూమర్ ఒక తీవ్రమైన వ్యాధి. కొన్నిసార్లు ఇది జస్ట్ చిన్న కణితిలా కనిపిస్తుంది. మరికొన్ని సార్లు మెదడులో క్యాన్సర్ తో కూడిన ట్యూమర్ . ఇలా చాలా స్టేజెస్ లో బ్రెయిన్ ట్యూమర్ కనుగొనబడుతుంది. అయితే ఈ లక్షణాలు కూడా చాలా సాధారణంగా కనిపిస్తాయి. దీనివల్లే చాలా మంది నెగ్లెట్ చేసేస్తారు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ప్రారంభంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
భారతదేశంలో ప్రతి సంవత్సరం 50 వేల మందికి పైగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. వీరిలో 20 శాతం మంది పిల్లలే . బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ప్రధాన కారణాలతో పర్యావరణ మార్పులు , రసాయన మూలకాలు , విషపూరిత పదార్ధాలు, జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభంలో చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే డాక్టర్ ను కలిస్తే అసలు వైద్యంతో నయం చెయ్యొచ్చు. అదే లేటు చేస్తే చికిత్స చెయ్యలేం.
లక్షణాలు..
* దృష్టి మందగించడం లేదా సడన్ గా విజన్ బ్లర్ అయిపోవడం ..అంటే ఎదురుగా ఉన్న మనిషి సడన్ గా చిమ్మచికట్లు కమ్ముతున్నట్లు కనిపిస్తారు.
* జ్ఞాపకశక్తిపై ప్రభావం పడడం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, పదాలను ఉచ్చరించడంలో కష్టం, పదాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది, బలహీనతగా అనిపించడం, నడవడానికి, కొన్ని పనులు చేయడానికి ఇబ్బందిగా ఉండటం.
* మానసిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. సడన్ గా కోపం..ఫీలింగ్స్ ను కంట్రోల్ చెయ్యలేకపోవడం. చిరాకు . ఇరిటేషన్ లాంటివిచాలా ఎక్కువగా ఉంటాయి.
* చెవుల్లో నిరంతరం గంట మోగినట్లు శబ్దం వినిపించడం కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావచ్చు.
* సకాలంలో చికిత్స ప్రారంభించడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ నుండి కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన టైంలో కాని బ్రెయిన్ ట్యూమర్ ను చికిత్స పొందగలిగితే ప్రాణాలు కాపాడుకోగలం.