తన ఫ్రెండ్ కూడా డాక్టరేనని, హైదరాబాద్‌లో అనెస్థీషియాలో ఎండీతోపాటు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనెస్థీషియాలో స్పెషలైజేషన్ చేస్తోందని ఆమె వివరించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కట్నం అడిగిన వాడు గాడిద...ఈ సామెత ఇప్పుడు కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్న వాళ్లందరిని అనాలి. కాని కట్నం ఇవ్వకుండా పెళ్లి కాదు కదా..పెళ్లి మాటలు కూడా కంప్లీట్ కాదు. ఈ సమాజం పెళ్లికి కట్నం ఇవ్వాల్సిందే అలా ట్యూన్ అయిపోయాం. కాబట్టి ఇందులో ఎవ్వవరిని తప్పు పట్టకూడదు. కాని అత్యాశకు పోయి కట్నం అడిగిన వారిని మాత్రం గాడిద అనడంలో తప్పులేదు. ఇలా కట్నం లో గొంతమ్మ కోరికలు అడుగుతున్న ఓ వ్యక్తి గురించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) టాపర్ ఒకరు డాక్టర్ అయిన తన స్నేహితురాలిని పెళ్లి చేసుకునేందుకు రూ. 50 కోట్ల కట్నం డిమాండ్ చేశాడట. దీంతో ఒళ్లు మండిన ఆ బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన బాధను అంతా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ కు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని ...అందులో ఓ వ్యక్తి ఇలా కట్నం అడిగారని చెపపింది. తన స్నేహితురాలిని కట్నం అడిగిన ఆ వ్యక్తి ఎయిమ్స్ ఎంట్రన్స్ (మాస్టర్ ఆఫ్ చిరుర్గియే ఇన్ యూరాలజీ)లో టాపర్ అని తెలిపింది.
తన ఫ్రెండ్ కూడా డాక్టరేనని, హైదరాబాద్‌లో అనెస్థీషియాలో ఎండీతోపాటు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనెస్థీషియాలో స్పెషలైజేషన్ చేస్తోందని ఆమె వివరించింది. అయితే ఇద్దరు డాక్టర్లు పెళ్లి చేసుకుంటే మంచిదే కాని ఇలా తన డిగ్రీ చూపించి కట్నం అడిగేవాడిని ఏం చెయ్యాలంటూ వాపోయింది. మరీ తెలుగు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే చాలా దారుణమైన పరిస్థితి ఎదురవుతుందని ...బాధపడింది.