ప్రస్తుత కాలంలో కొంతమంది డైట్ పేరిట రాత్రిపూట అన్నం తినకుండా ఉంటూ ఉంటారు. కొంతమంది ఉపవాసం వల్ల కూడా రాత్రిపూట తినకుండా ఉంటారు. మరి రాత్రిపూట అన్నం కానీ, ఇతర ఏ పదార్థాలు కానీ తినకుండా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రాత్రిపూట అన్నం తినకుండా ఉంటే బరువు చాలా వరకు తగ్గుతారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో కొంతమంది డైట్ పేరిట రాత్రిపూట అన్నం తినకుండా ఉంటూ ఉంటారు. కొంతమంది ఉపవాసం వల్ల కూడా రాత్రిపూట తినకుండా ఉంటారు. మరి రాత్రిపూట అన్నం కానీ, ఇతర ఏ పదార్థాలు కానీ తినకుండా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రాత్రిపూట అన్నం తినకుండా ఉంటే బరువు చాలా వరకు తగ్గుతారు.
శరీరంలో ఉండే క్యాలరీలు తగ్గించడం వల్ల బరువు ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా రాత్రిపూట తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల నిద్రలేమికి దారితీస్తుందట.
కాబట్టి ఆహారం తినకుండా ఉంటే నిద్ర నాణ్యత అనేది పెరుగుతుందని అంటున్నారు. మనం తినే అన్నంలో ఎక్కువగా గ్లైసేమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను మెరుగుపరుస్తుంది. కాబట్టి రాత్రి భోజనంలో అన్నం మానేస్తే టైప్2 మధుమేహం ఉన్నవారిలో చక్కర నియంత్రణలోకి వస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయట.
దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుందని అంటున్నారు. అలాగే రాత్రిపూట ఆహారం తినకపోవడం వల్ల మరుసటి రోజు అలసట శక్తి స్థాయిలు తగ్గుతాయి.