భారత్ కు శాంతి మంత్రం జపించడమే కాదు...యుధ్ధ తంత్రం కూడా వేయగలరని నిరూపించిన వ్యక్తి వాజపేయి అంటూ చెప్పుకొచ్చారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సంధర్భంగా రాజకీయ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. భారతదేశం గొప్పగా ఉండాలని కలలు కన్న దార్శనికుడు వాజపేయి అని అన్నారు. భారత్ కు శాంతి మంత్రం జపించడమే కాదు...యుధ్ధ తంత్రం కూడా వేయగలరని నిరూపించిన వ్యక్తి వాజపేయి అంటూ చెప్పుకొచ్చారు.
శత్రువుల చేత కూడా శభాష్ అనిపించుకున్న అజాత శత్రువు వాజపేయి అని, తన కవిత్వంతో జాతి ఊపిరిలో నిత్యం నిలిచిన అమరుడు... మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారు అంటూ ట్వీట్ చేశారు. వాజపేయి లాంటి గొప్ప వ్యక్తులు భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని తెలిపారు.
దేశాన్ని ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగానే ముందుకు నడిపించామని, ఇదే భారత ప్రజాస్వామ్యం గొప్పబలమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. వాజపేయి శత జయంతి సంధర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ వాజపేయి సేవలను ఎప్పటికి మరచిపోదని అన్నారు కిషన్ రెడ్డి.