సాధారణంగా మనం దేవుళ్ళకు పెట్టిన ప్రసాదాలు సమర్పించిన తర్వాత మనమే మళ్లీ తింటూ ఉంటాం. అది ఏ ఆలయంకి వెళ్లిన ఏ దేవుడి ప్రసాదం సమర్పించిన దేవుళ్ళు తినరు కాబట్టి దాన్ని వారికి
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మనం దేవుళ్ళకు పెట్టిన ప్రసాదాలు సమర్పించిన తర్వాత మనమే మళ్లీ తింటూ ఉంటాం. అది ఏ ఆలయంకి వెళ్లిన ఏ దేవుడి ప్రసాదం సమర్పించిన దేవుళ్ళు తినరు కాబట్టి దాన్ని వారికి నివేదించి మళ్లీ మనమే తింటాం. కానీ శివుడి గుడిలో శివలింగానికి సమర్పించిన ప్రసాదం మాత్రం భక్తులు అస్సలు తినకూడదట. అంతేకాదు శివలింగంలో పెట్టిన ప్రసాదాలను కూడా పండితులు తిరిగి అస్సలు ఇవ్వరు. మళ్లీ దీన్ని తీసుకెళ్లి పారే నీటిలో లేదంటే, ఎవరు తొక్కని చెట్ల కింద వేస్తూ ఉంటారు. సాధారణంగా శివుడికి పండ్లు, తేనె, పంచామృతం, గంగాజలం, పాలు, పువ్వులు, వంటివి సమర్పిస్తూ ఉంటారు. అలా సమర్పించిన వాటిని మరి భక్తులకు ఎందుకు ఇవ్వరు ఎందుకు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రసాదం తినకూడదు:
శివలింగానికి సమర్పించిన ప్రసాదం ఏదైనా సరే దాన్ని తినకూడదని పురాణాల నుంచే చెబుతున్నారు. దీని వెనక ఒక పెద్ద కథ ఉంది. శివుడి నోటిలో చండేశ్వరుడు నివసిస్తారని అంటారు. చండేశ్వరుడు ఆత్మలకు అధినాయకుడు. కాబట్టి శివునికి ప్రసాదించిన ఏ నైవేద్యమైన చండేశ్వరుడి వంశానికే చెందుతుందట. కాబట్టి ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మహా పాపమని అందుకే ప్రసాదాన్ని ఇతర భక్తులకు ఇవ్వారని అంటారు. ఇక ఇదే కాకుండా శివుడు సముద్ర మధనం చేసే సమయంలో విషం ఉద్భవిస్తుంది. దాన్ని శివుడు తాగుతాడు. ఆ విషం శరీరం మొత్తం చేరకుండా గొంతులోనే ఆపివేస్తాడు అప్పుడు గొంతు నీలిరంగలోకి మారడంతో నీలకంఠుడు అని పిలుస్తున్నారు. కాబట్టి శివలింగానికి సమర్పించిన ప్రసాదాలు మనం తింటే మనం కూడా విష లక్షణాలతో ఉన్న ఆహారం తిన్నట్టే అని భావిస్తారు.