జర్నలిస్టులపై ప్రభుత్వాల అరాచకత్వానికి అడ్డూ అదుపూ లేదు. చిన్న విమర్శను కూడా సహించలేక క్రిమినల్ కేసులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్షర యోధులకు కొండంత బలాన్నిచ్చేలా దేశ
ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
వార్తలను విమర్శలుగా భావించాలి!
ఆర్టికల్ 19 (1) ప్రకారం..
జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుంది
సుప్రీకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూస్ లైన్ డెస్క్: జర్నలిస్టులపై ప్రభుత్వాల అరాచకత్వానికి అడ్డూ అదుపూ లేదు. చిన్న విమర్శను కూడా సహించలేక క్రిమినల్ కేసులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్షర యోధులకు కొండంత బలాన్నిచ్చేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విమర్శనాత్మక కథనాలకు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని సూచించింది.
ప్రజాస్వామ్యంలో విమర్శనాత్మక కథనాలను సద్విమర్శలుగా భావించాలని, ఆ వార్తలను రాసిన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు కూడదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ వార్తా కథనం విషయంలో యూపీ సర్కార్ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆయన ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజాస్వామ్య దేశాల్లో భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను గౌరవించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.