health : " బట్ట ..పొట్ట " తగ్గించే సూపర్ ఫుడ్ ..డైట్ లో చేర్చుకొండి !

అలివ్ విత్తనం...ఇవి మహారాష్ట్ర సైడ్ చాలా బాగా తింటారు. మనకు తెలుగు రాష్ట్రాల్లో తెలీదు కాని...ఆయుర్వేదంలో అంతగా ప్రసిద్ధి చెందని గొప్ప ఔషదాలలో ఇది ఒకటి.  హలీమ్ సీడ్స్ లేదా గార్డెన్ క్రెస్ సీడ్స్ అని కూడా అంటారు. ఎంత హెల్దీ అంటే ..పొట్ట వెన్నలా కరిగిపోతుంది...నీరులా జారిపోతుంది అనే మాటలు   చెప్పం కాని చాలా హెల్దీ. మీ హార్ట్ కు చెడు కొలస్ట్రాల్ బాధ తగ్గాలంటే ట్రై చెయ్యండంటున్నారు ఆయుర్వేద నిపుణులు.వీటిని శతాబ్ధాలుగా సంప్రాదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. 

Published Jul 15, 2024 05:55:00 PM
postImages/2024-07-15/1721046372_120090017895186thumbnail4x3fat.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బట్ట ..పొట్ట ఇదేం బాష అంటారా...అచ్చుతెలుగులో ఇదే కదా అంటారు. అయినా యూత్ కి ఉండే ప్రధాన సమస్య.. అందరికి ఉంది యూత్ కే కాదు అంటారా ..దీని వల్ల యూత్ ఎఫెక్ట్ అవుతారు. పాపం యూత్ అని చెప్పుకోలేరు... యూత్ లా కనిపించరు. అయినా ఫుడ్ హెల్దీ గా ఉంటే కంప్లీట్ గా మీ గ్లామర్ ని మెయింటైన్ చెయ్యొచ్చు.

అలివ్ విత్తనం...ఇవి మహారాష్ట్ర సైడ్ చాలా బాగా తింటారు. మనకు తెలుగు రాష్ట్రాల్లో తెలీదు కాని...ఆయుర్వేదంలో అంతగా ప్రసిద్ధి చెందని గొప్ప ఔషదాలలో ఇది ఒకటి.  హలీమ్ సీడ్స్ లేదా గార్డెన్ క్రెస్ సీడ్స్ అని కూడా అంటారు. ఎంత హెల్దీ అంటే ..పొట్ట వెన్నలా కరిగిపోతుంది...నీరులా జారిపోతుంది అనే మాటలు   చెప్పం కాని చాలా హెల్దీ. మీ హార్ట్ కు చెడు కొలస్ట్రాల్ బాధ తగ్గాలంటే ట్రై చెయ్యండంటున్నారు ఆయుర్వేద నిపుణులు.వీటిని శతాబ్ధాలుగా సంప్రాదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. 

అలివ్ సీడ్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. ఇప్పుడు ఆడవారికి కూడా బట్టతల రావడం చూస్తున్నాం. కుదుళ్లు తో సహా జుట్టు ఊడిపోతుంది. అయితే ఈ హలీం సీడ్స్ వల్ల జుట్టు చాలా బాగా పెరుగుతుంది...ఈ సీడ్స్ కు జుట్టుకు స్ట్రాంగ్ గా చేసి ...బేబీ హెయిర్ వచ్చేలా చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వులు ఉంటాయి. కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటిమిన్ ఇ, ప్రోటీన్, ఐరన్, ఫోలిక్ యాసిడి వంటి పోషకాలు జుట్టు పెరుగుదలతో పాటు మొత్తం జుట్టు నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి.  బరువు తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. 

అలివ్ సీడ్స్​ను వారానికి మూడు సార్లు.. అర టీస్పూన్​తో ప్రారంభించి.. వాటిని పాలు, లస్సీ లేదా స్నూతీస్​లో కలిపి తీసుకోవచ్చు. లంచ్ కుముందు 15 నిమిషాలు ముందు నిమ్మకాయ నీటిలో కలుపుకొండి..వీటిని తీసుకోవడం వల్ల ఫుడ్ తక్కువ తింటారు. కొబ్బరి నీరు లేదా పాలు వంటి తక్కువ కేలరీలు కలిగి ఉన్న ఫుడ్​తో అలివ్ విత్తనాలు తీసుకోవచ్చు. జస్ట్ వారానికి రెండు రోజులు తీసుకుంటే చాలు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ట్రై చెయ్యండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news hair-fall fatyacids

Related Articles