సాధారణంగా చాలామంది సామాన్య ప్రజలు టూత్ బ్రష్ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్రష్ కొనుక్కొని నెలలకు నెలలు వాడుతూ ఉంటారు. మరి టూత్ బ్రష్ ను అలా వాడడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్వకాలంలో అయితే చాలామంది న్యాచురల్ గా దొరికేటువంటి చెట్లకు సంబంధించిన పుల్లలను బ్రష్ గా వాడేవారు. కానీ ప్రస్తుత కాలంలో అంతా మోడ్రన్ అయిపోయింది. టూత్ బ్రష్ ద్వారానే పళ్ళు తోముకుంటున్నారు. అలాంటి ఈ బ్రష్ ను ఎన్ని రోజులు వాడుకోవచ్చు.. ఎలా వాడుకోవాలి అనే వివరాలు చూద్దాం.
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా చాలామంది సామాన్య ప్రజలు టూత్ బ్రష్ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్రష్ కొనుక్కొని నెలలకు నెలలు వాడుతూ ఉంటారు. మరి టూత్ బ్రష్ ను అలా వాడడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్వకాలంలో అయితే చాలామంది న్యాచురల్ గా దొరికేటువంటి చెట్లకు సంబంధించిన పుల్లలను బ్రష్ గా వాడేవారు. కానీ ప్రస్తుత కాలంలో అంతా మోడ్రన్ అయిపోయింది. టూత్ బ్రష్ ద్వారానే పళ్ళు తోముకుంటున్నారు. అలాంటి ఈ బ్రష్ ను ఎన్ని రోజులు వాడుకోవచ్చు.. ఎలా వాడుకోవాలి అనే వివరాలు చూద్దాం.
ముఖ్యంగా జలుబు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధులు వచ్చినప్పుడు వాడిన బ్రష్ ను మళ్లీ అవి తగ్గిన తర్వాత అస్సలు వాడకూడదట. దీనివల్ల బ్యాక్టీరియా,వైరస్ ఆ టూత్ బ్రష్ బ్రిస్టల్స్ పై ఉంటాయట. అవి తగ్గిన తర్వాత ఈ బ్రష్ ను మార్చి కొత్త బ్రష్ కొనుక్కోవాలట. అయితే చాలామందికి అవగాహన లేక అదే బ్రష్ ను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే తప్పనిసరిగా టూత్ బ్రష్ వాడాలి.
ఒకవేళ ఆ బ్రష్ ను అలాగే మార్చకుండా వాడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా ఈ బ్రష్ లను ప్రతి మూడు నుంచి నాలుగు వారాలకు ఒకసారి మార్చుకోవాలట. ఇలా చేస్తే నోటి ద్వారా వచ్చేటువంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చట. కొంతమంది ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడుతూ ఉంటారు. అలాంటి వారు ఒక్క బ్రష్ ను రెండు నుంచి మూడు నెలల వరకు వాడుకోవచ్చట. అయితే ఈ పిరియడ్ అయిపోయిన తర్వాత బ్రష్ హెడ్ మారుస్తూ ఉండాలట. ఈ విధంగా సాధారణ బ్రష్ అయితే నెల రోజులకు ఒకసారి మారిస్తే సరిపోతుంది ఎలక్ట్రికల్ బ్రష్ అయితే రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి హెడ్ మారిస్తే దంతాలు, నోరు ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు దంత వైద్య నిపుణులు.