గత కొంతకాలం క్రిందట తెలంగాణ రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు, మళ్లీ పుంజుకున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: గత కొంతకాలం క్రిందట తెలంగాణ రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు, మళ్లీ పుంజుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ తరుణంలో గురువారం ఎల్లో అలర్ట్ జారీ చేసి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలియజేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బుధవారం కాస్త బలహీనపడడం వల్ల దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 km ఎత్తు కొనసాగుతుందని తెలియజేసింది.
దీని ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తాయని తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఇవే కాకుండా మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలియజేసింది.
ఉపరితల ద్రోని క్రమంగా పైకి కదులుతుండడంతో వర్షాలు ఉత్తర తెలంగాణపై ఎక్కువ ప్రభావం చూపుతాయని ఉత్తర తెలంగాణలోనే అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఇక మిగతా ప్రాంతాల్లో చిన్నచిన్నగా చెదురు మదురు వర్షాలు కురుస్తాయని అన్నది. హైదరాబాదులో కూడా వర్షాలు తక్కువగానే ఉంటాయని తెలియజేస్తోంది.