బాలీవుడ్ సినిమా లు ఎప్పుడు కాస్త హిందు వ్యతిరేకతను చూపిస్తాయనే అపవాదు ఉంది. దానిని మరో సారి రుజువు చేశారు బాలీవుడ్ డైరక్టర్ అనుభవ్ సిన్హా .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన IC 814 కాందహార్ హైజాక్ వెబ్ సీరిస్ పై పెద్ద దుమారమే . ఆ సినిమాలో టెర్రరిస్టులను చూపించిన విదానం పై పెద్ద చర్చే జరుగుతుంది. టెర్రరిస్టులకు హిందుల పేర్లు పెట్టడం చాలా పెద్ద రచ్చ లేపుతుంది. బాలీవుడ్ సినిమా లు ఎప్పుడు కాస్త హిందు వ్యతిరేకతను చూపిస్తాయనే అపవాదు ఉంది. దానిని మరో సారి రుజువు చేశారు బాలీవుడ్ డైరక్టర్ అనుభవ్ సిన్హా .
'ది కాందహార్ హైజాక్' పేరుతో వెబ్ సీరిస్ రూపొందించారు. ఇది ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. అయితే ఇందులో ఉగ్రవాదులను హిందువులుగా చూపించారంటూ... హిందూ పేర్లను వాడారంటూ దుమారం రేగుతోంది. వివాదం చెలరేగడంతో వెబ్ సీరీస్ లో మార్పులు చేపట్టారు. నిజానికి ఏ ఇండస్ట్రీలోను హిందువులపై ఇంత వివక్ష చూపించరు. కాని బాలీవుడ్ లో మాత్రం డైరక్ట్ గా హిందూ వ్యతిరేకతను బయటపట్టేస్తుంది.
బాలీవుడ్ లో హిందువులు పవిత్రంగా భావించే పాత్రలను, చిహ్నాలను కించపర్చేలా చూపిస్తారనే ఆరోపణలు వున్నాయి. పికే, ఓ మై గాడ్ వంటి సినిమాల్లో హిందూ ఆచారసాంప్రదాయాలపై చాలా దారుణంగా చూపించారు. అన్ని చోట్ల మోసాలు జరగవు. కాని హిందువుల్లో అందరు మోసగాళ్లే అన్నట్లు చూపించారు.మళ్లీ IC814 కాందహార్ హైజాక్ లో అలాగే చేసారని మండిపడుతున్నారు.హైజాకర్లు ఇస్లామిక్ టెర్రరిస్టులు అయినప్పటికి హిందూ పేర్లను వాడారంటూ మండిపడుతున్నారు. ఎందుకు ఇంత వివక్ష అంటూ కామెంట్ుల పెడుతున్నారు నెటిజన్లు.