Garlic:వెల్లుల్లి రెబ్బని చీప్ గా పడేస్తున్నారా..లాభాలు తెలిస్తే వదలరు.!

ప్రస్తుత కాలంలో చాలామంది  మన ఆరోగ్యానికి ఏదైతే మేలు చేస్తుందో ఆ ఫుడ్ తినకుండా మన నాలుకకు ఏదైతే రుచిగా ఉంటుందో దాన్ని తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సాధారణంగా బీట్రూట్ మన ఆరోగ్యాన్ని 100% బాగు చేస్తుంది. బీట్రూట్ తినాలంటే ఎవరు కూడా ముందుకు రారు. అదే తంసప్, స్ప్రైట్ లాంటి పానీయాలు మన ఆరోగ్యాన్ని  చాలావరకు పాడుచేస్తాయి. కానీ దాన్ని ఇష్టపడి మరి తాగుతూ ఉంటారు. అలాంటి వాటిలో వెల్లుల్లి రెబ్బ కూడా ఒకటి.


Published Jul 13, 2024 08:40:00 PM
postImages/2024-07-13/1720881833_garlic.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది  మన ఆరోగ్యానికి ఏదైతే మేలు చేస్తుందో ఆ ఫుడ్ తినకుండా మన నాలుకకు ఏదైతే రుచిగా ఉంటుందో దాన్ని తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సాధారణంగా బీట్రూట్ మన ఆరోగ్యాన్ని 100% బాగు చేస్తుంది. బీట్రూట్ తినాలంటే ఎవరు కూడా ముందుకు రారు. అదే తంసప్, స్ప్రైట్ లాంటి పానీయాలు మన ఆరోగ్యాన్ని  చాలావరకు పాడుచేస్తాయి. కానీ దాన్ని ఇష్టపడి మరి తాగుతూ ఉంటారు. అలాంటి వాటిలో వెల్లుల్లి రెబ్బ కూడా ఒకటి.

చాలామంది వెల్లులి మన ఫుడ్ లో కనిపిస్తే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ ఆ వెల్లుల్లి  మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు తెచ్చిపెడుతుందట. రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీకు చచ్చే వరకు డాక్టర్ తో అవసరం ఉండదు. దీంతో కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం.. వెల్లుల్లిని ఆంటీబయాటిక్స్ తో పోలుస్తారు. దీన్ని ప్రతిరోజు తినే ఆహారంలో చేర్చుకుంటే  దగ్గు ఇతర సమస్యలకు పరిష్కారం చూపుతుంది. వెల్లుల్లిలో ఉండే అలీసిన్ అనే ఆమైనో యాసిడ్ కు ఔషధ గుణాలు ఎక్కువ.

వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి, సెలీనియం  వ్యాధి నిరోధక శక్తిని  మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రక్తనాళాలను పనితీరును కూడా మెరుగుపరిచే శక్తి వెల్లుల్లిలో ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు కూడా నియంత్రణలోకి తేస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలు ప్రతిరోజు తింటే  అసలు ఒత్తిడే ఉండదు. అస్తమా శ్వాస తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు, వంటి ఇబ్బందుల నుంచి వెల్లుల్లి కాపాడుతుంది. నోటి సమస్యలకు వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుందట. వెల్లుల్లి మధుమేహగ్రస్తుల రక్తంలో  చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందట. కాబట్టి వెల్లుల్లిని చీప్ గా తీసేయకుండా ఆహారంలో భాగం చేసుకుని ప్రతిరోజు తినండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits heart-problems garlic-cloves

Related Articles